Karthika Deepam : దుమ్ములేపుతున్న డాక్టర్ బాబు భార్య.. డ్యాన్స్ వీడియో వైరల్
Karthika Deepam బుల్లితెర శోభన బాబుగా పేరు తెచ్చుకున్నాడు నిరూపమ్ పరిటాల. కార్తీక దీపం సీరియల్ తర్వాత నిరూపమ్ క్రేజ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న టీవీ సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ రేటింగ్‌లో నడుస్తోంది. అంటే ఆ సీరియల్‌కు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిరూపమ్ అసలు పేరు తెలియని వారు కూడా డాక్టర్ బాబు అంటే చాలు గుర్తుపట్టేస్తారు.
Karthika Deepam Nirupam Paritala Wife Manjula Excellent Dance Video Goes Viral
సీరియల్స్ చేస్తున్న సమయంలో తన సహా నటి మంజులను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చంద్రముఖి సీరియల్‌లో కలిసి నటించిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే మంజుల కూడా ఒకప్పుడు నటిగా రాణించింది. అయితే కొద్దికాలంగా వీరిద్దరు సోషల్ మీడియాలో తమ పోస్ట్‌లతో సందడి చేస్తున్నారు. ఒక యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించి అందులో వారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు, టూర్స్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి కొన్ని టీవీ షోలకు కూడా హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు.
Karthika Deepam : రీల్ వీడియోలతో మంజుల రచ్చ..
Karthika Deepam Nirupam Paritala Wife Manjula Excellent Dance Video Goes Viral
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంజుల.. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా మంజుల షేర్ చేసిన వీడియో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో డ్యాన్స్‌తో అదరగొట్టింది. దీంతో చాలా మంది నెటిజన్లు డాక్టర్ బాబు భార్య డ్యాన్స్ దుమ్ములేపిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
