
karthika deepam serial 7 november 2021 episode
Karthika Deepam 7 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు.. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 8 నవంబర్ 2021, 1191 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనితను పూజకు రావాలని డైరెక్ట్ గా మోనిత ఇంటికే సౌందర్య వెళ్లిన విషయం తెలిసిందే. నీకు ఒంటి నిండా పొగరే కదా.. నువ్వు నన్ను కావాలని నీ ఇంటి దాకా రప్పించావు అని సౌందర్య.. మోనితతో అంటుంది. రేపు దోషనివారణ పూజకు నువ్వు వస్తున్నావు అనగానే రాను అని చెప్పాను కదా ఆంటీ అంటుంది. నువ్వు వస్తున్నావు వస్తున్నావు అని చెప్పాను కదా అంటుంది సౌందర్య. నాకు ఇద్దరే కొడుకులు, ఇద్దరే కోడళ్లు. ఒళ్లు కొవ్వెక్కిన వాళ్ల గురించి నేను ఆలోచించను అంటుంది.
karthika deepam serial 7 november 2021 episode
కార్తీక్ కు ఏదైనా జరిగితే దీప అన్యాయం అయిపోతుంది. పిల్లలు ఆగం అయిపోతారు.. అనగానే మరి నా గురించి నా కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరా అంటే రేపు నువ్వు పూజకు వస్తున్నావు అంతే.. ఇది అభ్యర్థన కాదు ఆర్డర్ అనుకో అని చెప్పి సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా ఆంటి ఇంత దూరం వచ్చారు మనవడిని చూడరా… మనవడిని ఎత్తుకోరా అంటుంది మోనిత. అయినా కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య.
అదేంటమ్మా.. మీరే దోషనివారణ పూజ చేయాలని చెప్పి నాతో చెప్పించారు ఇప్పుడు పూజకు రానని చెప్పారు కదా అంటుంది ప్రియమణి. విన్నావా?.. అన్ని విన్నావా? ఇది కూడా నా ప్లాన్ లో భాగమే అని చెప్పి వెంటనే భారతికి ఫోన్ చేసి భారతి.. నేను రేపు పూజకు వస్తున్నానని మీ ఆంటికి చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
మరోవైపు కార్తీక్, దీప.. పిల్లలు కలిసి పడుకుంటారు కానీ.. ఎవ్వరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. నిజం చెప్పకుండా దీపను నేను మోసం చేస్తున్నానా? అసలు దీప మనసులో ఏముంది అని అనుకుంటాడు కార్తీక్. వీళ్లేంటి అసలు ఏం మాట్లాడటం లేదు అని అనుకుంటారు పిల్లలు.
వాళ్లను మాటల్లో దింపాలని.. డాడీ మీరిద్దరు ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారు అని అడుగుతుంది హిమ. దీంతో కార్తీక్.. తన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు తెచ్చుకుంటాడు. ఒకప్పటి డాక్టర్ బాబుకు ఇప్పటి డాక్టర్ బాబుకు ఎంత తేడా ఉంది అని అనుకుంటుంది దీప. దీప నేను మారిపోలేదు.. పరిస్థితులే నన్ను అలా మార్చాయి అని అనుకుంటాడు కార్తీక్. మోనిత విషయంలో జరిగింది నేను చెప్పలేను. అలా అని దాచిపెట్టి నిన్ను ఇంకా ఇంకా మోసం చేయలేను అని అనుకుంటాడు కార్తీక్.
karthika deepam serial 7 november 2021 episode
ఈ మధ్య నాకన్నా ఎక్కువ కథలు తెలిసిన వాళ్లు ఈ ఇంట్లో ఉన్నారని ఈ మధ్య తెలిసింది అంటుంది దీప. ఎవరు అంటే మీ నాన్నే ఆయనకు మంచి కథలు తెలుసు అంటుంది దీప. రేపు మనమందరం బయటికి వెళ్దామా అమ్మా అని అడుగుతారు పిల్లలు. చెప్పమ్మా హోటల్ కు వెళ్దామా అంటారు. కానీ.. దీప మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అన్నా కూడా వినదు. అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దీప గురించి తెగ టెన్షన్ పడతాడు కార్తీక్. దీపకు ఏమైంది. ఒకవేళ మోనిత గురించి తెలిసిందా? అని అనుకొని టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.