
Netizens fires on jabardasth mano and rakesh
jabardasth : సింగర్ మనో జబర్దస్త్ జడ్జ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జడ్జ్‌గా టీమ్ మెంబర్స్‌కు స్కోర్ ఇవ్వడమే కాకుండా.. అప్పుడప్పుడు స్కిట్స్‌లో సందడి చేస్తుంటాడు మనో. అయితే ఇటీవల జబర్దస్త్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు మనోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం.. ప్రోమోలో ఒక విధంగా చూపెట్టి.. స్కిట్‌లో అందుకు సంబంధించిన కంటెంట్ లేకపోవడమే. దీంతో టీఆర్‌పీల కోసం ఇంతకు దిగజారాలా అని రాకేష్‌తో పాటు మనో, జబర్దస్త్ టీమ్‌పై మండిపడుతున్నారు.
Netizens fires on jabardasth mano and rakesh
అసలేం ఏమైంది.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో.. మనో ఫుల్ సీరియస్ అయ్యాడు. టీమ్ లీడర్ రాకేష్‌పై సీరియస్ అయి.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా చూపెట్టారు. రాకేష్ స్కిట్‌పై కామెంట్స్ చేసిన మనో.. ‘ఎంత గౌరవం అయ్యా.. రాకేష్ నువ్వంటే నాకు రాకేష్. ఏమిటిది పద్దతేనా అసలు.. ఏ స్టేజ్.. నువ్వు చేస్తుంది ఏమిటి..?’ అని అడిగాడు. అయితే రాకేష్ కామెడీగా అని సమాధానం ఇచ్చాడు. దీంతో మనో ఐయాం సో సారీ అంటూ జడ్జ్ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. రాకేష్ ఆపడానికి వెళ్లి సారీ సార్ అని చెప్పాడు.. అయితే మనో మాత్రం ఆయనపై చేయి ఎత్తాడు. ఆ తర్వాత రోజకు సారీ చెప్పి బయటకు వెళ్తున్నట్టుగా చూపెట్టారు.
Netizens fires on jabardasth mano and rakesh
అయితే ఈ ప్రోమో చూసిన జనాలు ఇదంతా వట్టిదేనని అప్పుడే పసిగట్టారు. డ్రామాలు అంటూ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో అందుకు సంబంధించి ఎలాంటి సీన్స్ లేకపోవడంతో ఫుల్‌గా ఫైర్ అవుతున్నారు. టీఆర్‌పీలో మరి ఇంత దారుణంగా చేస్తారా అంటూ మండిపడుతున్నారు.. ప్రోమోలో చూపెట్టింది ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ టీమ్‌పై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రోమో కోసం పడ్డపాట్లు ఇలా చీవాట్లు పెట్టిస్తున్నాయి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.