కీర్తి సురేష్ కాస్త డిసప్పాయింట్ లో ఉందా.. అవుననే మాట వినిపిస్తోంది. తను ఎన్నో నమ్మకాలు పెట్టుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే ఆ సినిమాలలో ఇప్పటికే రిలీజైన రెండు సినిమాలు ఘోరంగా దెబ్బ తీశాయి. ఆ సినిమాలే పెంగ్విన్.. మిస్ ఇండియా. ఈ రెండు సినిమాల తర్వాత కాస్త కీర్తి క్రేజ్ దెబ్బ తిన్నదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖీ మీద ఈ రెండు సినిమాల ప్రభావం పడుతుందన్న ఆలోచన ఒకవైపు ఉందని అంటున్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం ఇదరు సూపర్ స్టార్స్ తో భారీ సినిమాలు చేస్తోంది.
అందులో ఒక సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా లతో పాటు నయనతార .. కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నయన తార లాంటి స్టార్ హీరోయిన్ తో పాటు ఖుష్బూ.. మీనా కూడా ఉన్నారు కాబట్టి ఈ సినిమా ద్వారా కీర్తి కి దక్కే క్రేజ్ అంతగా ఉండదని భావిస్తుందట. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోయో సర్కారు వారి పాట సినిమా మీదే కీర్తి సురేష్ పూర్తిగా నమ్మకం పెట్టుకుందని అంటున్నారు.
ఈ సినిమాలో కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ .. 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ సమ్యుక్తంగా నిర్మిస్తుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమా 2021 ఆగస్టు 7 న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇక పాన్ ఇండియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయో ఈ సినిమాతో కీర్తి క్రేజ్ విపరీతంగా వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యంగ్ హీరో నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తుండగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.