టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి కి మంచి సినిమాలలో నటించే అవకాశం దక్కింది. మొదటి సినిమా అందాల రాక్షసి సినిమాతో ఏకంగా రాజమౌళి లాంటి దర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగానే సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికి కొన్ని సినిమాల వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అందాల రాక్షసి తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తూ సినిమాలతో వరసగా సూపర్ హిట్స్ అందుకుంది.
అయితే ఆ తర్వాతే లావణ్య కెరీర్ ఇబ్బందుల్లో పడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాతో పాటు యంగ్ హీరోలతో రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటిలిజెంట్ లాంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలన్ని లావణ్య కి హిట్ ఇవ్వలేకపోయాయి. ఇదే లావణ్య కి బాగా మైనస్ అయింది. చెప్పాలంటే లావణ్య లో మంచి పర్ఫార్మర్ ఉన్నారు. కాని అందుకు తగ్గ కథ లే పడటం లేదు. అలాంటి సాలీడ్ సినిమాలు గనక రెండు పడితే లావణ్య టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం పక్కా. కాని ఎందుకనో ఆ అవకాశాలు దక్కడం లేదు.
ఇక కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత కాస్త కెరీర్ ఊపందుకుంది. ఇప్పుడు లావణ్య చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఏ 1 ఎక్స్‌ప్రెస్ కాగా రెండవ సినిమా ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ నటిస్తున్న చావుకబురు చల్లగా. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 బ్యానర్ లో నిర్మాణం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మీదే లావణ్య కెరీర్ డిపెండ్ అయి ఉందని అంటున్నారు. నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో అలాగే నిఖిల్ లాంటి యంగ్ హీరోలతో నటించి మెప్పిస్తున్నా ఎందుకు లావణ్య స్టార్ హీరోయిన్ కాలేకపోతుందో అర్థం కావడం లేదంటున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.