
keerthy Suresh Relationship : ఎట్టకేలకి తన ప్రేమాయణంపై స్పందించిన కీర్తి సురేష్.. అతనితో 15 ఏళ్లు ప్రేమలో..!
Keerthy Suresh Relationship : మహానటి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకి క్లారిటీ వచ్చింది. కీర్తి మెడలో అతి త్వరలో మూడు ముడులు పడనున్నాయి. ఈ మలయాళీ భామ త్వరలో ఓ ఇంటి కోడలు కానున్నారు. ఈ విషయం తెలిసింది. అయితే… తన పెళ్లి కబురు కీర్తి సురేష్ స్వయంగా చెప్పారు. దీపావళి సందర్భంగాఆంటోని తట్టిళ్‌తో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఆమె ’15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది’ అని తెలిపింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఆంటోని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు కీర్తి.
keerthy Suresh Relationship : ఎట్టకేలకి తన ప్రేమాయణంపై స్పందించిన కీర్తి సురేష్.. అతనితో 15 ఏళ్లు ప్రేమలో..!
ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గామారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కీర్తికి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదట ఈ పోస్ట్‌పై నటి రాశీఖన్నా స్పందిస్తూ.. ‘‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్ లవ్’’ అని విష్ చేసింది. ఆ తర్వాత మాళవికా మోహనన్, అరుణ్ విజయ్, త్రిష, అపర్ణాబాల మురళి, సంయుక్తా మేనన్, నిక్కీ గల్రానీ, అనపమా పరమేశ్వరన్, శ్రీకాంత్ ఓదెల, పూజిత పొన్నాడ తదితర సినీ సెలబ్రిటీలు కీర్తికి కంగ్రాట్స్ తెలిపారు.
హీరోయిన్లు మాళవిక మోహనన్, ప్రియాంక అరుల్ మోహన్, రాశీ ఖన్నా, నజ్రియా నజీమ్, త్రిష తదితరులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. హీరో సందీప్ కిషన్, ‘వెన్నెల’ కిశోర్ సహా మరికొంత మంది ప్రముఖులు కూడా విషెస్ చెప్పారు. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆంటోని ప్రస్తుతం దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. ఆయన ఓ వ్యాపారవేత్త. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయం బయటకు రాకుండా బాగా మేనేజ్ చేశారు.డిసెంబర్ 11న గోవాలో కుటుంబ సభ్యులు, కొంత మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ పెళ్లికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత మంది హీరోలు దర్శక నిర్మాతలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. keerthy suresh confirms Antony Thattil relationship and introduces her fiance
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.