keerthy Suresh Relationship : ఎట్ట‌కేల‌కి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన కీర్తి సురేష్‌.. అతనితో 15 ఏళ్లు ప్రేమ‌లో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

keerthy Suresh Relationship : ఎట్ట‌కేల‌కి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన కీర్తి సురేష్‌.. అతనితో 15 ఏళ్లు ప్రేమ‌లో..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 November 2024,3:30 pm

ప్రధానాంశాలు:

  •  keerthy Suresh Relationship : ఎట్ట‌కేల‌కి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన కీర్తి సురేష్‌.. అతనితో 15 ఏళ్లు ప్రేమ‌లో..!

Keerthy Suresh Relationship  : మ‌హాన‌టి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఎట్టకేల‌కి క్లారిటీ వ‌చ్చింది. కీర్తి మెడలో అతి త్వరలో మూడు ముడులు పడనున్నాయి. ఈ మలయాళీ భామ త్వరలో ఓ ఇంటి కోడలు కానున్నారు. ఈ విషయం తెలిసింది. అయితే… తన పెళ్లి కబురు కీర్తి సురేష్ స్వయంగా చెప్పారు. దీపావళి సందర్భంగాఆంటోని తట్టిళ్‌తో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఆమె ’15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది’ అని తెలిపింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఆంటోని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు కీర్తి.

keerthy Suresh Relationship ఎట్ట‌కేల‌కి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన కీర్తి సురేష్‌ అతనితో 15 ఏళ్లు ప్రేమ‌లో

keerthy Suresh Relationship : ఎట్ట‌కేల‌కి త‌న ప్రేమాయ‌ణంపై స్పందించిన కీర్తి సురేష్‌.. అతనితో 15 ఏళ్లు ప్రేమ‌లో..!

keerthy Suresh Relationship  రివీల్ చేసింది..

ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గామారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కీర్తికి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదట ఈ పోస్ట్‌పై నటి రాశీఖన్నా స్పందిస్తూ.. ‘‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్‌ లవ్‌’’ అని విష్ చేసింది. ఆ తర్వాత మాళవికా మోహనన్, అరుణ్ విజయ్, త్రిష, అపర్ణాబాల మురళి, సంయుక్తా మేనన్, నిక్కీ గల్రానీ, అనపమా పరమేశ్వరన్, శ్రీకాంత్ ఓదెల, పూజిత పొన్నాడ తదితర సినీ సెలబ్రిటీలు కీర్తికి కంగ్రాట్స్ తెలిపారు.

హీరోయిన్లు మాళవిక మోహనన్, ప్రియాంక అరుల్ మోహన్, రాశీ ఖన్నా, నజ్రియా నజీమ్, త్రిష తదితరులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. హీరో సందీప్ కిషన్, ‘వెన్నెల’ కిశోర్ సహా మరికొంత మంది ప్రముఖులు కూడా విషెస్ చెప్పారు. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆంటోని ప్రస్తుతం దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. ఆయన ఓ వ్యాపారవేత్త. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయం బయటకు రాకుండా బాగా మేనేజ్ చేశారు.డిసెంబర్ 11న గోవాలో కుటుంబ సభ్యులు, కొంత మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ పెళ్లికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత మంది హీరోలు దర్శక నిర్మాతలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. keerthy suresh confirms Antony Thattil relationship and introduces her fiance

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది