Keerthy Suresh Cute Speech Sarkaru Vaari Paata Pre Release Event
Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన రీసెంట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మే 12 న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిన్న యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది మహేశ్ అభిమానుల సమక్షంలో మరియు సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహరథుల సమక్షంలో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పాటలు యూ ట్యూబ్ దుమ్ముదులుపుతున్నాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్లలో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి.
ఇతర స్టార్ హీరోలకు సవాల్ విసురుతున్నాయి. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేశ్ ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను పెద్ద తెర మీద చూస్తామా? అని వెయిట్ చేస్తున్నారు.ఈ సందర్భంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిత్ర హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ కూడా హాజరయింది. ఈ సందర్భంగా అమ్మడు మాట్లాడుతూ.. మహేశ్ ను ఆకాశానికెత్తేసింది. అతడి అందం ముందు ఎవరైనా సరే దిగదుడుపే అని చెప్పింది.
Keerthy Suresh Cute Speech Sarkaru Vaari Paata Pre Release Event
మహేశ్ అందాన్ని తాను ఎక్కడ మ్యాచ్ చేయలేనో అని కంగారు పడినట్లు తెలిపింది. అంతే కాకుండా ఆయన టైమింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అని తెలిపింది. ఇక మహేశ్ రియల్ లైఫ్ కళావతి అయిన నమ్రత శిరోద్కర్ కు ధన్యవాదాలు తెలియజేసింది. తాను ప్రస్తుతం ఫంక్షన్ కు రాకపోయినా కానీ తాను అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఇక మ.. మ.. మహేశ్ గురించి మాట్లాడాలంటే చాలా కంగారొస్తుందని తెలిపారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. తనకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ పేట్లకు థ్యాంక్స్ చెప్పింది.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.