Home » Entertainment » Keerthy Suresh Taken Their Words So Seriously
Entertainment

కీర్తి సురేష్ వాళ్ళ మాటలని సీరియస్ గా తీసుకుంది..!

Authored By
vamana sai
The Telugu News | Published on: December 22, 2020, 12:53 pm
Advertisement

కీర్తి సురేష్ లాక్ డౌన్ లో కూడా తన సినిమాలని రిలీజ్ చేసి గ్రేట్ అనిపించుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి వచ్చిన క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. అయితే కీర్తి సురేష్ మహానటి సినిమా కోసం కాస్త లావవ్వాల్సి రావడంతో సినిమాకి తగ్గట్టు గా తయారైంది. కాని మహానటి తర్వాత వరసగా కమర్షియల్ సినిమాలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కమిటవడం వల్ల మేకోవర్ లో కొన్ని ఛేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది.

Advertisement

ఈ క్రమంలోనే డైట్ చేసి బాగా సన్నబడింది. సన్నబడటం అంటే అలా ఇలా కాదు చాలా నాజుకుగా అన్నమాట. కీర్తి సురేష్ సన్నబడిన తర్వాత చూస్తే ఏకంగా ఎవరీయమ్మాయి అనేంతగా తనని తాను మార్చుకుంది. కాని ఈ లుక్ మెజారిటీ జనాలకి నచ్చలేదు. దాదాపుగా అందరి నుంచి నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. నేను శైలజ , నేను లోకల్ లాంటి సినిమాలలో కీర్తి సురేష్ ని చూసిన ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే కీర్తి సురేష్ నుంచి వచ్చిన గత చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా డిసప్పాయింట్ చేశాయి.

Advertisement

ముఖ్యంగా కీర్తి సురేష్ సన్నబడిన తర్వాత లుక్ ఎవరికీ నచ్చలేదు. అంతేకాదు ఈ ప్రభావం తాజాగా కమిటయిన సినిమాల మీద కూడా బాగా పడుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే మళ్ళీ కీర్తి సురేష్ కి లావెక్కమని సలహా ఇచ్చారట. ప్రస్తుతం వాళ్ళ మాటలని సీరియస్ గా తీసుకున్న కీర్తి సురేష్ బాగా నచ్చిన ఫుడ్ అంతా లాగించేసి మళ్ళీ బొద్దుగా తయారయ్యే పనిలో ఉందట. ఇప్పటికే కొంత మార్పు వచ్చి కీర్తి మళ్ళీ జనాలకి నచ్చేలా తయారైందని చెప్పుకుంటున్నారట.

Advertisement

ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గుడ్ లక్ సఖీ, నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి