Jahnvi Kapoor : శ్రీదేవి తనయురాలుగా జాన్వి కపూర్ బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూనే సౌత్ ఇండస్ట్రీ మీద తన ఫోకస్ పెట్టింది. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో అవకాశం రాగానే అందిపిచ్చుకుంది. దేవర సినిమాలో జాన్వి కపూర్ అందాల ప్రదర్శన తెలుగు ఆడియన్స్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అమ్మ శ్రీదేవి లానే జాన్వి కపూర్ కూడా తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వాలని కలలు కంటుంది . అందుకు దేవర ఫలితం కూడా కాస్త ఎంకరేజ్ చేసినట్లే అనిపిస్తుంది.
ఇతర హీరోయిన్ నుండి పోటీని ముందే గెస్ చేసిన జాన్వి కపూర్.. అందుకు తగినట్టుగానే వరుస ప్లానింగ్ తో దూసుకెళ్తుంది. అయితే తనకు పోటీ ఎక్కడో లేదు తన ఇంటి నుండే వస్తుందని ఊహించలేకపోయింది అమ్మడు. జాన్వి కపూర్ తర్వాత శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా రెడీ అవుతుంది. ఇవాళో రేపో అన్నట్టుగా ఖుషి మొదటి సినిమా ప్రయత్నాలు చర్చల దశలో ఉన్నాయి. ఈలోగా సోషల్ మీడియాలో తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది ఖుషి కపూర్.
అందుకే అక్క జాన్వి కపూర్ ఫోటోషూట్లకు దీటుగా ఖుషి కూడా వరుస ఫోటోషూట్లతో దుమ్ము దులిపేస్తుంది. ఖుషి తరంగటం తర్వాత కచ్చితంగా జాన్వికి కూడా తను గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జాన్వి కపూర్ చూడటానికి కాస్త బొద్దుగా ఉంటుంది అది ఆమెకు మైనస్ కాకపోయినా ఖుషి సన్నగా నాజూకుగా ఉంటుంది కాబట్టి ఆమెకు అది అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. సో ఏదో ఒక రోజు జాన్వికి ఖుషి కపూర్ నుండే త్రెట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఖుషి కపూర్ ని తెలుగులో కూడా తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఫిలింనగర్ టాక్. సో బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా జాన్వికి ఖుషి గట్టి ఫైట్ ఇచ్చేలా ఉంది. మరి ఖుషి మొదటి సినిమా ఏది అవుతుంది ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
Pooja Hegde : అందాల భామ పూజా హెగ్దేకి సౌత్ లో బ్యాడ్ టైం కొనసాగుతుంది. అమ్మడు చేసిన సినిమాలు…
Vijay Devarakonda - Rashmika Mandanna : రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఈ ఇద్దరి…
PAN Card 2.0 : ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డుల ( PAN card ) సరైన వినియోగం…
Airtel : భారతదేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన మొబైల్ రీఛార్జ్ మరియు డేటా ప్లాన్లను పెంచింది.…
Rythu Bharosa : జనవరిలో సంక్రాంతి పండుగ నుంచి అమలు చేయనున్న ‘రైతు భరోసా’ అనే ప్రతిష్టాత్మక పథకం విధివిధానాలను…
Shriya Saran: హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకుని నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన యువ హీరో…
This website uses cookies.