Koilamma fame Amar in cherlapally jail
Koilamma : గత కొన్ని రోజులుగా కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్ వ్యవహారం ఎటూ తేలకుండా అంతు చిక్కకుండా మలుపులు తిరుగుతోంది. రాత్రి పూట తాగి వచ్చి తమపై దౌర్జన్యం చేశాడని ఇద్దరు యువతులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో తమ తప్పేమి లేదని అమర్ కూడా కేసులు పెట్టాడు. కానీ చివరకు అటు తిరిగి ఇటు తిరిగా అమర్ చర్లపల్లి జైల్లోకి వెళ్లాడని తెలుస్తోంది. రెండు మూడు రోజుల క్రితమే ఈ వ్యవహారం గురించి, ఆ రాత్రి జరిగిన దాని గురించి క్లారిటీగా చెప్పాడు. మేరకు రాయదుర్గం పోలీసులు అమర్‌ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. బొటిక్ వ్యవహారంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ముదరడంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే.
Koilamma fame Amar in cherlapally jail
జనవరి 27న అమర్ రాత్రివేళ తమ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ రాయదుర్గం పోలీసుల్ని ఆశ్రయించింది శ్రీ విద్య అనే యువతి. అమర్‌తో పాటు ముగ్గురు ఆకతాయిలు.. స్వాతి అనే బొటిక్ పార్టనర్ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించింది శ్రీ విద్య. అమర్, స్వాతిల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ శ్రీవిద్యతో పాటు అపర్ణ అనే మరో యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలు ఈ గొడవకు తనకు సంబంధం లేదని.. తామంతా స్నేహితులమే అని.. కుట్రప్రకారమే తనని ఇందులో ఇరికించారని.. ఓ టీవీ జర్నలిస్ట్ కుట్ర పన్ని ఇలా చేసిందని.. ఆమె తనను చెంపపై కొట్టడమే కాకుండా రౌడీ షీటర్లతో తమపై దాడి చేయించిందంటూ సంచలన విషయాలను చెప్పాడు అమర్. వారే రౌడీలతో మాపై దాడికి దిగారని అమర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరిది నిజం? ఏది నిజం? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.