JR NTR : కొరటాల శివ ఏమైంది.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాని అలా వెన‌క్కు తీసుకెళుతున్నావేంటి?

Authored By Sam C | The Telugu News | Published on: July 10, 2022, 9:00 pm

JR NTR : ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా విడుద‌లైన కొద్ది రోజుల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌న కొత్త ప్రాజెక్ట్ చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మాత్రం ఇంత‌వ‌ర‌కు మొద‌లు కాలేదు. దీనిపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ కొద్ది రోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జూలై నెల కూడా వచ్చేసింది. కానీ, సినిమా ప్రారంభం గురించి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో రాబోయే ఈ సినిమాను జూలైలో ప్రారంభించడం లేదట. సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. ఇందుకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు.

Koratala Siva Jr NTR movie shooting on september 

Koratala Siva Jr NTR movie shooting on september

JR NTR : మ‌ళ్లీ వాయిదానా..

కానీ, ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవడంతో నందమూరి ఫ్యాన్స్‌లో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు.. అన్ని సిస్టమ్‌లను ఎదురించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp