
koratala shiva may be out from NTR 30 movie
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లు గా గత ఏడాది ప్రకటన వచ్చింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించక పోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల్లో కూడా ఈ విషయమై తెగ చర్చ జరుగుతోంది. ఆచార్య సినిమా పరాజయం తర్వాత కొరటాల శివ తో సినిమా అంటే కాస్త ఇబ్బంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయం లో ఎన్టీఆర్ కూడా కొరటాల శివ తో సినిమా విషయంలో కాస్త వెనుకడుగు వేశాడు అనే వార్తలు అందుతున్నాయి.
కొరటాల శివ తో కాకుండా వెంటనే ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కనిపిస్తున్నాడు. గత ఏడాది ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుచ్చి బాబు సూపర్ హిట్ దక్కించుకున్నాడు. గత ఏడాది నుండి ఎన్టీఆర్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయింది. కానీ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఓ సినిమా చేయాల్సి రావడంతో బుచ్చిబాబు వెయిటింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ వద్ద సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు వైపు ఎన్టీఆర్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని గతంలోనే వార్తలు వచ్చాయి.
koratala shiva may be out from NTR 30 movie
ఇప్పుడు వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి, బుచ్చిబాబు ఇటీవల తన గురువు సుకుమార్ తో కలిసి ఎన్టీఆర్ కోసం ఫైనల్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేశాడు. అతి త్వరలోనే ఆ స్క్రిప్టుని వినిపించి ఎన్టీఆర్ తో ఓకే చెప్పించి వెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఒకవేళ అదే జరిగితే ఎన్టీఆర్ 31వ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ అవ్వబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ 32 కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడు ఏమో చూడాలి. ఇప్పటికే ప్రీ లుక్ ను కూడా విడుదల చేయడం వల్ల ఎన్టీఆర్ మాట తప్పుతాడా అనేది కూడా ఒకింత చర్చకు తెర తీస్తుంది. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.