Kota Bommali Director : ఈ సినిమాను అందుకే తీశా.. కోటబొమ్మాళి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kota Bommali Director : ఈ సినిమాను అందుకే తీశా.. కోటబొమ్మాళి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Kota Bommali Director : హీరో శ్రీకాంత్, శివాణి రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార సభను తాజాగా నిర్వహించారు. ఈసందర్భంగా మూవీ డైరెక్టర్ తేజ మార్ని మాట్లాడుతూ.. కోట బొమ్మాళి సినిమాను నేను గత సంవత్సరమే కథ రాసుకున్నాను. ఈ సినిమా జర్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సినిమా గురించి మాట్లాడాలంటే ముందు లింగిడి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఒక నాలుగు లైన్ల కోసం అందరు రచయితల దగ్గరికి వెళ్లాను

  •  దీన్ని ఎవడైనా పాట అంటాడా? అన్నాడు ఆ రచయిత

  •  ఈ సినిమాలో రామకృష్ణ క్యారెక్టర్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది

Kota Bommali Director : హీరో శ్రీకాంత్, శివాణి రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార సభను తాజాగా నిర్వహించారు. ఈసందర్భంగా మూవీ డైరెక్టర్ తేజ మార్ని మాట్లాడుతూ.. కోట బొమ్మాళి సినిమాను నేను గత సంవత్సరమే కథ రాసుకున్నాను. ఈ సినిమా జర్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సినిమా గురించి మాట్లాడాలంటే ముందు లింగిడి లింగిడి పాట గురించి చెప్పాలి. ఆ పాట బాణి కట్టించి తయారు చేయించినప్పుడు మధ్యలో చిన్న లిరిక్ విషయంలో ప్రాబ్లమ్ వచ్చింది. నాకు ఒక నాలుగు లైన్ల కోసం అందరు రచయితల దగ్గరికి వెళ్లాను. అప్పుడు ఒక లిరిసిస్ట్ ఇది ఒక పాటేనా.. దీన్ని ఎవడైనా పాట అంటాడా? ఇలాంటి దాన్ని మీరు మళ్లీ రాయమని అనడం అంటూ మెసేజ్ పెట్టాడు. చాలామందిని అడిగాను కానీ.. ఎవ్వరూ రాయలేకపోయారు. దీంతో దీన్ని ఎందుకు నేను మార్చాలి.. అలాగే ఉంచితే అయిపోతుంది కదా అనుకున్నా.. చివరకు ఆ పాట హిట్ అయింది.. అన్నారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే పోలీసు చేజింగ్ పోలీసు. ప్రస్తుతం పోలీసులు ఎలా నలిగిపోతున్నారో మేము చూపించాలని అనుకున్నాం. ఒక పొలిటిషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మల్లా తయారవుతున్నారు అనేది మేము టచ్ చేశాం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో చేయకుండా ఆపడం, జగన్ గారిని ఎయిర్ పోర్ట్ లో ఆపడం, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం.. ఇలాంటి సినారియోను చూసి కథ రాసుకున్నా. ఓటరు ఐడీ ఉన్న ప్రతి ఒక్కరు మా సినిమా వచ్చి చూడాలి. మీరు ఖచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. టెక్నిషియన్స్ పరంగా చూస్తే మా కెమెరామెన్ జగదీశ్ గారు బాగా సపోర్ట్ చేశారు. బన్నీ వాసు గారు, విద్యా మేడమ్ కూడా మద్దతు ఇచ్చారు. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అన్నారు.

Kota Bommali Director : ఈ సినిమా క్యారెక్టర్స్ ను మీరు అస్సలు మరిచిపోరు

నేను మధ్యలో ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినా కూడా వాళ్లంతా నాకు చాలా మద్దతు ఇచ్చారు. రీరికార్డింగ్ అందించిన రంజన్ రాజ్ కానీ.. ఇతర టెక్నిషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో రామకృష్ణ క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ ను మీరు మరిచిపోరు. ఆ క్యారెక్టర్స్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్కరికి థాంక్స్. నన్ను సపోర్ట్ చేసినందుకు గీత ఆర్ట్స్ కు, శ్రీకాంత్, రాహుల్, శివానీ అందరికీ ధన్యవాదాలు.. అంటూ డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది