Home » Entertainment » Krishna And Tammareddi Bharadwaj Fight For Silk Smitha
Entertainment

Krishna : టాప్ డైరెక్టర్, కృష్ణ కు మధ్య పెద్ద గొడవ కావడానికి కారణం ఆ స్టార్ హీరోయినేనా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: December 27, 2021 3:57 pm
Advertisement

Krishna : ఒకప్పుడు కృష్ణ అంటే ఒక రేంజ్ ఉండేది. ఆయన అప్పట్లో సూపర్ స్టార్. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి రేంజ్ ఉన్న హీరో ఆయన. వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కృష్ణ. ఒకే సంవత్సరంలో 10 వరకు సినిమాల్లో నటించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం. 1993 లో వచ్చిన పచ్చని సంసారం సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమాతో కృష్ణ కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది తమ్మారెడ్డి భరద్వాజ.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అవ్వడంతో కృష్ణ, భరద్వాజ కాంబోలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసిన సమయం అది. సినిమా షూటింగ్ సమయంలో..

Advertisement

ఒక ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేయండి అని అన్నాడట కృష్ణ. అయితే.. అదే సమయంలో కమెడియన్ బాబు మోహన్ తో ఐటెం సాంగ్ చేయడం కామన్ అయిపోయింది.అయితే.. సూపర్ స్టార్ కృష్ణతో కంటే.. బాబు మోహన్ తో ఐటెమ్ సాంగ్ పెట్టిస్తే బాగుంటుందని అనుకున్నాడు భరద్వాజ. బాబుమోహన్ తో ప్లాన్ చేశాడు కానీ.. దానికి కృష్ణ ఒప్పుకోలేదు. నాకు, సిల్క్ స్మిత మధ్య ఐటెమ్ సాంగ్ పెట్టించండి అన్నాడు కృష్ణ.దీంతో ప్రత్యేకంగా సెట్ వేయించి.. కృష్ణ, సిల్క్ స్మిత మధ్య ఐటెమ్ సాంగ్ షూట్ చేయించారు. అదే సమయంలో కృష్ణకు తెలియకుండా.. అన్నపూర్ణ స్టూడియోలో ఇంకో సెట్ వేయించి బాబు మోహన్, సిల్క్ స్మిత మీద ఐటెమ్ సాంగ్ షూట్ చేయించారు. ఈ విషయాన్ని కృష్ణకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు భరద్వాజ.

Krishna and tammareddi bharadwaj fight for silk smitha

Advertisement

Krishna : కృష్ణను కాదని బాబు మోహన్ తో ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేసిన భరద్వాజ

అయితే.. బాబు మోహన్ తో చేయించిన ఐటెమ్ సాంగ్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో వెంటనే సెన్సార్ ఆఫీసుకు వెళ్లాడు కృష్ణ. అప్పటికీ గానీ కృష్ణకు తెలియలేదు.. ఆ ఐటెమ్ సాంగ్ తీసింది నా మీద కాదు.. బాబు మోహన్ మీద అని. దాని గురించి తెలుసుకున్న తర్వాత తమ్మారెడ్డితో మాట్లాడిన కృష్ణ.. మన స్నేహాన్ని మోసం చేశావు అని చెప్పాడట. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య మాటలు లేవట. ఆ తర్వాత ఓ మూడేళ్ల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదట. ఇప్పటి తమ్మారెడ్డి.. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పట్లో అలా కృష్ణను మోసం చేశా అని చెబుతుంటాడు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి