Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ గురించి అందరికీ తెలిసిందే.జబర్దస్త్ గానీ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో గానీ వర్ష మీద వేసే పంచ్‌లు ఏంటి? సెటైర్లు ఏంటి? అనేది అందరికీ తెలిసిందే. ఆమె మీద ఎప్పుడూ బాడీ షేమింగ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఆమె ఆడది కాదంటూ.. మగాడిలా ఉందంటూ.. లేడీ గెటప్ అని, కీచు గొంతు అని, ఆమె మాట్లాడితేనే చిరాకు వేస్తుంటుందంటూ ఇలా బోలెడన్ని కామెంట్లు, సెటైర్లు వేస్తుంటారు. అయినా వర్ష ఎప్పుడూ సీరియస్ అవ్వలేదు. ఆమధ్య ఒకసారి స్టేజ్ మీద ఎమోషనల్ అయింది. ప్రతీ సారి ఎందుకు అలా అనడం అంటూ స్టేజ్ మీదే అలిగింది. ఇక ఇమాన్యుయేల్ వర్షల మధ్య పెద్ద గొడవే జరుగుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఇమ్ము సారీ చెప్పడంతో అంతా సెట్ అయింది. ఆ తరువాత మళ్లీ వెంటనే స్కిట్ కూడా వేసేశారు. అయితే అలా వర్షను ప్రతీ ఒక్కరూ అదే పంచ్‌లతో ఆడుకుంటారు. లేడీ గెటప్, అమ్మాయా?అబ్బాయా? తెలియడం లేదంటూ కౌంటర్లు వేస్తుంటారు. ఇక ముందు నుంచి ఉన్న ఆర్టిస్టులు కాబట్టి అలా అంటున్నారని అనుకోవచ్చు. కానీ గెస్టులుగా వచ్చిన వారు కూడా అవే పంచులతో ఆడేసుకుంటున్నారు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో వచ్చింది. ఇందులో గెస్టుగా కృష్ణ భగవాన్ వచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్‌గా తెలుగు వారిపై తనదంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించాడు. కానీ మళ్లీ ప్రస్తుతం బిజీగా ఉంటున్నాడనిపిస్తోంది. తాజాగా ఆయన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఈవెంట్‌కు వచ్చాడు.
ఇందులో ఒక్కొక్కరి మీద ఆయన వేసిన పంచులు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చివరకు ఆది, రాం ప్రసాద్‌లను కూడా వదిలి పెట్టలేదు. దొంగ నా కొడుకు అని పరోక్షంగా కౌంటర్లు వేశాడు. చిన్న తనంలో నా కొడుకు, కూతురు తప్పి పోయారు.. వాళ్లు తిరిగి వస్తే నా ఆస్తి అంతా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ చెబుతాడు కృష్ణ భగవాన్. దీంతో వర్ష ముందుకు వస్తుంది.. నేనే నీ కూతురిని అని అంటుంది. అవును ఈడే నా కొడుకు అని కృష్ణ భగవాన్ అనేస్తాడు. దీంతో వర్ష దెబ్బకు వెనక్కి మళ్లుతుంది. అలా వర్షను అమ్మాయిగా ఎవ్వరూ అక్కడ చూడటం లేదనిపిస్తోంది.
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
This website uses cookies.