Krithi Shetty : సమంతను మైమరిపిస్తున్న కృతిశెట్టి.. అస్సలు తగ్గట్లేదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : సమంతను మైమరిపిస్తున్న కృతిశెట్టి.. అస్సలు తగ్గట్లేదా..?

Krithi Shetty : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరయిన్ స్టేటస్ దక్కించుకుంది అందాల భామ కృతిశెట్టి. ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషనల్ స్టార్ అయిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఆ చిత్రంతో కృతిశెట్టి..హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ భామ ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఈమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ విడుదలైంది. ఇందులో కృతి పర్ఫార్మెన్స్ కు మంచి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 January 2022,8:30 pm

Krithi Shetty : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరయిన్ స్టేటస్ దక్కించుకుంది అందాల భామ కృతిశెట్టి. ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషనల్ స్టార్ అయిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఆ చిత్రంతో కృతిశెట్టి..హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ భామ ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఈమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ విడుదలైంది. ఇందులో కృతి పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో ఈమె నటించిన ‘బంగార్రాజు’ విడుదల కానుంది.

కృతిశెట్టి డేట్స్ కోసం ప్రజెంట్ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్ టాక్. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ‘బంగార్రాజు’ చిత్రంలో ‘నాగలక్ష్మి’గా కృతిశెట్టి అలరించనుంది. ఇందులో మహిళా సర్పంచ్ పాత్రను నాగలక్ష్మి అత్యద్భుతంగా పోషించిందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం డెఫినెట్‌గా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.ఈ చిత్రంలో కృతిశెట్టి నాగార్జునకు భార్యగా నటించింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో హీరోలు నాగార్జున, నాగచైతన్య, హీరోయిన్ కృతిశెట్టి యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

krithi shetty behaving like samantha

krithi shetty behaving like samantha

Krithi Shetty : అక్కినేని హీరోలతో హ్యాపీగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న కృతిశెట్టి..!

ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. కాగా, ప్రమోషన్స్‌లో కృతిశెట్టి బిహేవియర్ గురించి సోషల్ మీడియాలో పలువురు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్యలు సమంతను మరిచిపోయేలా కృతిశెట్టి బిహేవ్ చేస్తోందని, షూటింగ్ టైం నుంచి మొదలుకుని ప్రమోషన్స్ వరకు ఎప్పుడూ హీరోలతోనే ఉంటున్నదని అంటున్నారు. అలా కృతిశెట్టి హ్యాపీగా అక్కినేని వారి భజన చేస్తోందని కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత కూడా తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో ఇలాగే చేసిందని, ‘మనం’ షూటింగ్, ఫిల్మ్ ప్రమోషన్స్‌లో సేమ్ కృతిశెట్టి లాగానే బిహేవ్ చేసిందని పోస్టులు పెడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది