Krithi Shetty:తొలి సినిమా మంచి విజయం సాధించడం ఎవరికైన మెమరబుల్ అనే చెప్పాలి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం అందంతోనే కాకుండా నటన పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంది. తను నవ్వుతోనే కొంటె చూపుతో కట్టిపడేసింది అని చెప్పాలి. బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా ఆమెకు మంచి విజయాన్ని అందుకుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవి నటించినప్పటికీ కృతి శెట్టి కూడా చాలా హైలెట్ గా నిలిచింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఫస్టాఫ్ లోనే రొమాంటిక్ సీన్స్ తోనే డామినేట్ చేసింది. ప్రస్తుతం కృతి ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి.
అయితే కృతి శెట్టి నటించిన ఉప్పెన సినిమా ఏడాది పూర్తైన సందర్భంగా ఎమోషనల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది కృతి. ‘జీవితంలో రెండు పుట్టిన రోజులుంటే అందులో ఒకటి మన పుట్టినరోజు. ఇంకొకటి.. మనం జీవితంలో ఏం చేయాలో సెలెక్ట్ చేసుకున్న రోజుగా భావిస్తా. సంవత్సరం క్రితం నటిగా ఎంట్రీ ఇచ్చి ఇష్టపడి ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నాను. కాబట్టి ఈ రోజును మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. మీ అందరి ఆదరాభిమానాలు దక్కడం నాకు మరింత సంతోషాన్నిస్తోంది. ఇంకా చాలా కష్టపడి మంచి మంచి పాత్రలో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది కృతి శెట్టి.
ప్రస్తుతం రామ్ పోతినేని సరసన ‘వారియర్’, ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రాలతో బిజీగా ఉంది. నేటితరం హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ దూసుకుపోతోంది కృతి శెట్టి. ఈ బ్యూటీకి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తమిళంలో శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందట. అంతే కాకుండా గోపీచంద్- శ్రీవాస్ సినిమాలో కూడా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఆఫర్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఏడాది కూడా బిజీ బిజీగా కనిపిస్తుంది. అంతేకాకుండా వెయిటింగ్ లిస్ట్ లో కూడా కొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.