krithi shetty in troubles
Krithi Shetty : కృతి శెట్టి.. కొద్ది రోజుల వరకు ఈ అమ్మడి పేరు తెగ మారుమ్రోగిపోయింది. వరుసగా మూడు హిట్స్ ఈ అమ్మడి ఖాతాలో పడే సరికి కృతి హవా టాలీవుడ్‌లో బాగా ఉండేది. కాని ఈ అమ్మడికి రీసెంట్‌గా రెండు ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. కృతి నటించిన ఉప్పెన మంచి హిట్ కాగా, ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వస్తూ వస్తూనే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇది అతి కొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్ ఖాతాలో వేసుకుంది.
కృతి శెట్టి నటించిన ది వారియర్ మూవీ ప్లాప్ అయ్యింది. రూ. 10 నుండి 15 కోట్ల నష్టాలు మిగిల్చిన ది వారియర్ టాలీవుడ్ డిజాస్టర్స్ లో ఒకటిగా చేరింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా విడుదలైన ఈ మూవీ రొటీన్ కమర్షియల్ సినిమా అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారుకొత్తదనం లేని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు.
krithi shetty in troubles
బాడ్ టాక్ నేపథ్యంలో ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. మరి అదే జరిగితే కృతి శెట్టి వరుసగా మరో ప్లాప్ ఖాతాలో వేసుకున్నట్లే. వచ్చే నెలలో సుధీర్ కి జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల కానుంది. ఏమాత్రం ఫార్మ్ లో లేని మోహన కృష్ణ ఇంద్రగంటి, సుధీర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఏమాత్రం అంచనాలు లేవు. ఆ చిత్రం కూడా అటూ ఎటూ అయితే ఆమె హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసినట్లవుతుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.