Krithi Shetty : కృతి శెట్టి ప‌రిస్థితి ఇంత దారుణంగా మారిందేంటి.. ఇలా అయితే క‌ష్ట‌మే అమ్మ‌డు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 13 August 2022, 1:00 pm

Krithi Shetty : కృతి శెట్టి.. కొద్ది రోజుల వ‌ర‌కు ఈ అమ్మ‌డి పేరు తెగ మారుమ్రోగిపోయింది. వ‌రుస‌గా మూడు హిట్స్ ఈ అమ్మ‌డి ఖాతాలో ప‌డే స‌రికి కృతి హ‌వా టాలీవుడ్‌లో బాగా ఉండేది. కాని ఈ అమ్మ‌డికి రీసెంట్‌గా రెండు ఫ్లాప్స్ వ‌చ్చి ప‌డ్డాయి. కృతి న‌టించిన ఉప్పెన మంచి హిట్ కాగా, ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వస్తూ వస్తూనే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇది అతి కొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్ ఖాతాలో వేసుకుంది.

Krithi Shetty : జాగ్ర‌త్త సుమీ..

కృతి శెట్టి నటించిన ది వారియర్ మూవీ ప్లాప్ అయ్యింది. రూ. 10 నుండి 15 కోట్ల నష్టాలు మిగిల్చిన ది వారియర్ టాలీవుడ్ డిజాస్టర్స్ లో ఒకటిగా చేరింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా విడుదలైన ఈ మూవీ రొటీన్ కమర్షియల్ సినిమా అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారుకొత్తదనం లేని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు.

krithi shetty in troubles

krithi shetty in troubles

బాడ్ టాక్ నేపథ్యంలో ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. మరి అదే జరిగితే కృతి శెట్టి వరుసగా మరో ప్లాప్ ఖాతాలో వేసుకున్నట్లే. వచ్చే నెలలో సుధీర్ కి జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల కానుంది. ఏమాత్రం ఫార్మ్ లో లేని మోహన కృష్ణ ఇంద్రగంటి, సుధీర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఏమాత్రం అంచనాలు లేవు. ఆ చిత్రం కూడా అటూ ఎటూ అయితే ఆమె హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసినట్లవుతుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి