Kriti Sanon : ప‌దేళ్లు చిన్న వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో ఆదిపురుష్ బ్యూటీ డేటింగ్‌.. అంతా షాక్

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 25 March 2024, 9:10 pm
  •  Kriti Sanon : ప‌దేళ్లు చిన్న వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో ఆదిపురుష్ బ్యూటీ డేటింగ్‌.. అంతా షాక్

Kriti Sanon : పొడుగు కాళ్ల సుంద‌రి కృతి స‌న‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు బాలీవుడ్ భామగా పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. వ‌న్ నేనొక్క‌డినే, దోచేయ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఈ రెండు సినిమాలు కూడా దెబ్బ‌కొట్టాయి. ఇక ఇటీవ‌ల ప్ర‌భాస్‌తో క‌లిసి ఆదిపురుష్ అనే పాన్ ఇండియా చిత్రం చేసింది. ఈ చిత్రం కూడా దారుణంగా విఫ‌లం అయింది. సీత‌గా కృతి స‌న‌న్ న‌టించ‌గా, ఆమె పాత్ర‌కి కూడా ప్ర‌త్యేక మార్కులు ప‌డింది లేదు. ఇక ఇప్ప‌ట్లో ఈ భామ తెలుగులో సినిమాలు చేసే అవ‌కాశం లేదు. ప్ర‌స్తుతం కృతి సనన్ తన తదుపరి సినిమా ‘క్రూ’ ప్రచారాలలో నిమ‌గ్నం అయింది.. ఈ సినిమాలో కృతి సనన్ తో పాటు, టబ్బు, కరీనా కపూర్ లు కూడా ప్రధాన పాత్రల్లో కనపడుతున్నారు.

ఇటీవ‌ల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది, ఇది విమానంలో పని చేస్తే ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ల నేపథ్యంలో తీసిన సినిమా అని అంద‌రు భావిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే కరీనా, టబు, కృతి సనన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు, విమానంలో వీరిమధ్య వచ్చే సంభాషణ, సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. అయితే తాజాగా కృతి స‌న‌న్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. కృతి సనన్ తనకన్నా పదేళ్ళు చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో ఉంద‌ని బాలీవుడ్‌లో తెగ ప్ర‌చారం న‌డుస్తుంది. అందుకు కార‌ణం ఇటీవ‌ల ఈ భామ వీకెండ్ హాలిడే కోసం లండన్ వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాల‌కి చిక్కింది.

Kriti Sanon : ప‌దేళ్లు చిన్న వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో ఆదిపురుష్ బ్యూటీ డేటింగ్‌.. అంతా షాక్

Kriti Sanon : ప‌దేళ్లు చిన్న వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో ఆదిపురుష్ బ్యూటీ డేటింగ్‌.. అంతా షాక్

అయితే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న పిక్స్ చూస్తే అందులో కృతి బ్యాక్ సైడ్ క‌నిపిస్తుంది. ఫొటోలో ఉన్న అబ్బాయి పేరు కబీర్ బహియా కాగా, ఆయ‌న వయసు 23 ఏళ్ళు. కృతి సనన్ వయసు 33 ఏళ్ళు. బాలీవుడ్ లో తమకంటే చిన్న వయసు ఉన్న కుర్రాళ్లతో డేటింగ్ చేసే ట్రెండ్ చాలా కాలంగా సాగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.. ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు వయసున్న నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కృతి స‌న‌న్ కూడా త‌న క‌న్నా చిన్న వ‌య‌స్సు వ్య‌క్తితో డేటింగ్‌లో ఉంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. కబీర్ బహియా .. ధోనికి బంధువు అవుతార‌ని కూడా కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి