Kruthi shetty : కృతిశెట్టి క్రేజ్ తో ఏకంగా ఆ స్టార్ హీరోయిన్ నే టచ్ చేసేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kruthi shetty : కృతిశెట్టి క్రేజ్ తో ఏకంగా ఆ స్టార్ హీరోయిన్ నే టచ్ చేసేసిందిగా..!

 Authored By govind | The Telugu News | Updated on :18 February 2021,7:30 am

Kruthi shetty : కృతిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అంతేకాదు మేకర్స్ కి ఇప్పుడు కృతిశెట్టి డేట్స్ కావాలంటే అంత సులభం కాదని తెలుస్తోంది. నిన్నా.. మొన్నటి వరకు టాలీవుడ్ లో మేకర్స్ అందరూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా ఎదిగిన పూజా హెగ్డే .. రష్మిక మందన్న డేట్స్ కోసం వేయిట్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని కాదని 17 ఏళ్ళ యంగ్ బ్యూటీ కృతిశెట్టి డేట్స్ కోసం పాకులాడుతున్నారట. డెబ్యూ సినిమా రిలీజ్ కాకముందే రెండు సినిమాలని కమిటయింది. ఇక ఉప్పెన సినిమా రిలీజై భారీ సక్సస్ అందుకొని ఏళ్ళ తరబడి ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది.

kruthi shetty touched that star heroine by craze

kruthi-shetty-touched-that-star-heroine-by-craze

ఈ క్రమంలో కృతిశెట్టి డేట్స్ చాలా కాస్ట్లీ అయ్యాయని అంటున్నారు. అయినా మేకర్స్ .. యంగ్ హీరోలు ఈ యంగ్ బ్యూటీ నే కావాలని పట్టుపడుతున్నారట. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న స్టార్ స్టేటస్ నే టచ్ చేసిందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రష్మిక మందన్న ని అనుకుంటున్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కృతిశెట్టి వద్దకు వెళుతున్నాయట. ఇప్పుడు రష్మిక మందన్న తెలుగులో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా తో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో కూడా సినిమాలు ఒప్పుకుంటోంది.

Kruthi shetty : కృతిశెట్టి రష్మిక మందన్న కి పోటీ వచ్చి సినిమాలని దక్కించుకుంటోంది..?

అయితే రష్మిక మందన్న కి కృతిశెట్టి పోటీ వచ్చి ఇప్పటికే తెలుగు సినిమాలని దక్కించుకుంటోంది. నాని, సుధీర్ బాబు సినిమాలున్నాయి. అలాగే మరికొన్ని యంగ్ హీరోలు నటించే సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ఇక కోలీవుడ్ లో కూడా కృతిశెట్టి డేట్స్ కావాలని మేకర్స్ ట్రై చేస్తున్నారట. రీసెంట్ గా తమిళ హీరో కార్తీ నటించబోయో నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా కృతికి అవకాశం వచ్చిందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ కి కృతిశెట్టి సైన్ చేసిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి కృతిశెట్టి ఈ ఏడాదిలో స్టార్ హీరోయిన్ గా అందరికీ గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది