Intinti Gruhalakshmi : తులసి వల్లే నందు జాబ్ పోయిందని తులసి ఇల్లు వదిలేసి అనసూయ నందు, లాస్య ఇంటికి వెళ్లిపోతుందా? పరందామయ్య ఏం చేస్తాడు?

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 17 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 765 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు నా కొడుకువు కాదురా.. ఆ నంద గోపాల్ గారి కొడుకువు అంటూ ప్రేమ్ తో అంటుంది తులసి. ఆడాళ్లకు ఎన్నో సమస్యలు ఉంటాయి. తను నీకోసం పనిమనిషిగా పని చేస్తే నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి.. తనను తిడతావా అని ప్రేమ్ కు గడ్డి పెడుతుంది. దీంతో నన్ను క్షమించు అమ్మ.. అని చెప్పి తులసి కాళ్లు పట్టుకుంటాడు ప్రేమ్. దీంతో నా కాళ్లు కాదు పట్టుకోవాల్సింది.. శృతి కాళ్లు పట్టుకో.. క్షమించు అని అడుగు అంటుంది తులసి. దీంతో శృతి కాళ్లు పట్టుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత శృతి క్షమిస్తుంది. రెండు జంటలకు మళ్లీ ఫస్ట్ నైట్ నిర్వహిద్దామని అంటుంది అనసూయ.

lasya provokes anasuya on tulasi about nandu job

దీంతో కరెక్టే అని అనుకొని వాళ్ల రూమ్ లు డెకరేట్ చేసి శృతి, అంకిత ఇద్దరినీ రెడీ చేస్తారు. ఆ తర్వాత రెండు జంటలు ఏకాంతంగా కాసేపు గడుపుతాయి. రాత్రంతా రెండు జంటలు రొమాన్స్ లో మునిగిపోతాయి. మొత్తానికి మరోసారి రెండు జంటలకు తులసి ఫస్ట్ నైట్ జరిపిస్తుంది. ప్రేమ్, శృతి జంటతో పాటు అభి, అంకిత జంటల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. దీంతో రెండు జంటలు ఒక్కటవుతాయి.

కట్ చేస్తే మీ అబ్బాయి జాబ్ వదిలేశాడు అని అనసూయకు ఫోన్ చేసి చెబుతుంది లాస్య. దీంతో అనసూయ షాక్ అవుతుంది. సామ్రాట్ ను రెచ్చగొట్టి నందును అవమానించేలా చేసింది ఆ తులసి అని తులసి మీద లేనిపోనివి కలిపి అనసూయకు చెప్పి తనకు తులసి మీద కోపం వచ్చేలా చేస్తుంది లాస్య.

Intinti Gruhalakshmi :  అనసూయను రెచ్చగొట్టిన లాస్య

పస్తులతో మాడితే కాళ్ల బేరానికి వస్తామని తులసి ఐడియా అనుకుంటా అంటుంది లాస్య. దీంతో ఇంత జరిగినా ఆ తులసి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంది అనసూయ. ఇప్పుడు మనమందరం తనకు శత్రువులం అయ్యాం అంటుంది లాస్య.

సామ్రాట్ అండ చూసుకొని తన ఆట తను ఆడుతుంది అంటూ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది లాస్య. దీంతో అనసూయకు చాలా కోపం వస్తుంది. అనసూయను రెచ్చగొట్టి ఫోన్ పెట్టేస్తుంది లాస్య. ఇంతలోనే అత్తయ్య అంటూ తన దగ్గరికి వస్తుంది అనసూయ.

తులసిని కోపంగా చూస్తుంది అనసూయ. దీంతో తులసికి భయం వేస్తుంది. తులసి అప్పుడే ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అయి బయటికి వస్తుంది. లాస్య చెప్పుడు మాటలు విని కోపంతో తులసిని అనసూయ ఏం చేస్తుంది? సామ్రాట్ ఆఫీసుకు వెళ్లొద్దని వారిస్తుందా? లేక.. లాస్య ఇంటికే వెళ్లిపోతుందా.. అనేది తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

1 hour ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

2 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

3 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

4 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

5 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

7 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

7 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

10 hours ago