Janaki Kalaganaledu : తులసి కోటలో దొరికిన రింగ్ ను చూసి జ్ఞానాంబ ఏం చేస్తుంది? జానకిని మెచ్చుకుంటుందా? మల్లిక గురించి అసలు నిజం తెలుస్తుందా?

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 17 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 411 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ విషయంలో ఒకసారి ఆలోచించాలని కుటుంబ సభ్యులంతా జ్ఞానాంబకు చెబుతారు. దీంతో సరే నేను అఖిల్ విషయంలో ఆలోచించడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత తెల్లవారుజాము దాకా జానకి చదువుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అలాగే కూర్చొని నిద్రపోతుంది.

janaki finds ring in tulasi kota in janaki kalaganaledu

ఉదయమే నిద్రలేచాక.. రామా తనను డిస్టర్బ్ చేయకుండా తన పనులన్నీ చేయాలని అనుకుంటాడు. పరీక్షలు పూర్తయ్యే వరకు జానకి గారు ఇంటి పనులేవీ ముట్టుకోకుండా నేనే సహాయంగా ఉండాలి అని అనుకుంటాడు రామా. వెంటనే తన పనులన్నీ పూర్తి చేసి.. కాఫీ చేసి తనకు తీసుకొని వస్తుండగా మల్లిక చూసి షాక్ అవుతుంది. వామ్మో.. బావ గారేంటి ఇప్పుడు కాఫీ చేసి తీసుకొని వెళ్తున్నారు అని అనుకుంటుంది మల్లిక.

కట్ చేస్తే కాఫీ తీసుకొని వెళ్లి జానకిని నిద్రలేపుతాడు రామా. దీంతో అయ్యో మీరెందుకు కాఫీ తీసుకొచ్చారు అని అడుగుతుంది జానకి. కాఫీ మాత్రమే కాదు.. మీ పనులన్నీ చేశాను అంటాడు రామా. దీంతో ఇంటి పనులు చేయడం కూడా నా బాధ్యత అంటుంది జానకి.

Janaki Kalaganaledu : జానకి ఐపీఎస్ కాకూడదని ప్లాన్ వేసిన మల్లిక

కానీ.. రామా మాత్రం ఏం కాదు.. మీరు పరీక్షలు అయిపోయేంత వరకు చదువు మీదనే దృష్టి పెట్టండి. మీరు ఐపీఎస్ అయ్యాక మీరు ఎలా చెబితే అలా అంటాడు రామా. ఇవన్నీ విన్న మల్లిక.. నేను ఉన్నాక నిన్ను ఎలా ఐపీఎస్ చదవనిస్తా.. నువ్వు ఎలా ఐపీఎస్ అవుతావో చూస్తా.. అని కోపంగా బయటికి వస్తుంది.

అసలు జానకి ఐపీఎస్ అయితే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది మల్లిక. అసలు జానకి ఐపీఎస్ చదవడానికి వీలు లేదు అనుకుంటుంది. వెంటనే తులసి కోటను చూసి అక్కడికి వెళ్లి ఆ తులసి కోటను కూలగొట్టేస్తుంది. ఇంతలో జ్ఞానాంబ తులసి కోటకు పూజ చేయడానికి అక్కడికి వస్తుంది.

మల్లిక తులసి కోటను కూలగొట్టడం జానకి, రామా చూస్తారు. తులసి కోట కింద పడి ఉండటం చూసి జ్ఞానాంబ
షాక్ అవుతుంది. అందరినీ పిలుస్తుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు. అసలు ఈ తులసి కోట ఎలా కిందపడిందో ఎవ్వరికీ తెలియదా అని అడుగుతుంది జ్ఞానాంబ.

ఇంతలో మల్లిక వచ్చి జానకి పనే అయి ఉంటుంది అంటుంది. లేకపోతే జెస్సీ చేసి ఉంటుంది అంటుంది. కానీ.. జెస్సీ నేను చేయలేదు అంటుంది. దీంతో ఆ పని చేసింది మల్లికే అని రామా చెప్పబోతుండగా ఆపిన జానకి.. నేనే చేశాను అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

ఆ తర్వాత అక్కడ ఉన్న మట్టిని తీసి తులసి కోటను సెట్ చేయబోతుండగా జానకికి అందులో ఒక రింగ్ దొరుకుతుంది. ఆ రింగ్ ను చూసి ఏదో రింగ్ దొరికింది అని చెబుతుంది. ఆ రింగ్ ను తీసుకున్న గోవిందరాజు.. ఇది మా పెళ్లి నాటి ప్రధమ ఉంగరం అని చెబుతాడు.

ఆ ఉంగరాన్ని చూసి జ్ఞానాంబ చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 minutes ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

29 minutes ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

4 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

5 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

7 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

8 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

17 hours ago