Home » Entertainment » Latest Update About Prabhas Project K Shooting
Entertainment

Prabhas : ప్రభాస్ ప్రాజెక్ట్ K కోసం ఎంత ఖర్చు అవుతోందో తెలిస్తే మీరు కళ్ళు తేలేస్తారు !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: February 26, 2023 11:04 pm
Advertisement

Prabhas : బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ కు సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎంతలా అంటే.. బాహుబలి హీరో సినిమాలు ఎంతలా ఆడాలి కానీ.. అవి అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో సలార్, ప్రాజెక్ట్ కే లాంటి బడా సినిమాలు కూడా ఉన్నాయి. బాహుబలి రేంజ్ లో వస్తున్న సినిమా అయితే ప్రాజెక్ట్ కే. అందుకే ఆ సినిమాపై ప్రభాస్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

latest update about prabhas project k shooting

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్టర్. అశ్వినీదత్ ప్రొడ్యూసర్. మహానటి సినిమాకు దర్శకత్వం వహించింది నాగ్ అశ్వినే. ఈ సినిమా బడ్జెటే రూ.500 కోట్లు. ఇది మామూలు సినిమా కాదు. సోషియో ఫాంటసీ మూవీ. సైన్స్ ఫిక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్. బాలీవుడ్ బిగ్ బి.. అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Prabhas : వచ్చే సంక్రాంతికి కానుకగా విడుదల కానున్న ప్రాజెక్ట్ కే మూవీ

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయిందట. కేవలం 30 శాతం షూటింగ్ బాకీ ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నీ చేసుకోవడానికి ఇంకా 11 నెలల సమయం ఉంది. ఈలోపు ఇవన్నీ పూర్తి చేసుకొని సంక్రాంతికి బరిలోకి దిగడానికి ప్రభాస్ సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమాలో ఉండే వీఎఫ్ఎక్స్ అనుభూతి మరే సినిమాలో ఉండదు అని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమా అయినా ప్రభాస్ ను మళ్లీ పట్టాలెక్కిస్తుందో లేదో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి