
war between ANR and jagapathi babu father Rajendra Prasad
Akkineni Nageswara Rao : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కు కెరీర్ ఇచ్చిన వారిలో దుక్కిపాటి మధుసూదన్ రావు మరియు గూడవల్లి రామబ్రహ్మం లాంటివారు ముందు వరుసలో ఉంటారు. అక్కినేని వీరిని తన గురువుగా భావిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు అంత పెద్ద స్టార్ హీరోగా ఎదగటానికి ఈ దర్శక నిర్మాతలు కారణం కావడం విశేషం. వీరి తర్వాత అదే స్థాయిలో అక్కినేనికి విజయాలను అందించిన వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ గారికి ఆ ప్లేస్ దక్కుతుంది. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి రాజేంద్రప్రసాద్ నిర్మాతగా ఏఎన్ఆర్ తో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అయితే రాజేంద్రప్రసాద్ గారికి అక్కినేని వారికి మంచి స్నేహం ఉండేది.
war between ANR and jagapathi babu father Rajendra Prasad
ఈ క్రమంలోనే అక్కినేని మరియు వాణిశ్రీ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘ దసరా బుల్లోడు ‘ సినిమా తీయాలని రాజేంద్రప్రసాద్ నిర్ణయించుకున్నారు. కానీ ఆ సినిమా కోసం అనుకున్న దర్శకుడు వేరే సినిమాతో బిజీగా ఉండడంతో అక్కినేని నాగేశ్వరరావు రాజేంద్రప్రసాద్ ని దర్శకత్వం వహించమని కోరారు. ఒకవేళ రాజేంద్రప్రసాద్ దర్శకత్వం చేయకపోతే తాను ఆ సినిమాలో నటించను అంటూ కండిషన్ పెట్టారు. అలా ఏఎన్ఆర్ బలవంతంతో రాజేంద్రప్రసాద్ దర్శకుడిగా ‘ దసరా బుల్లోడు ‘ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలా వీరి బంధం కూడా ఎంతగానో బలపడింది. అయితే ఆ సినిమా టైంలో అక్కినేని మరియు రాజేంద్రప్రసాద్ మధ్య గొడవ జరిగిందట.
war between ANR and jagapathi babu father Rajendra Prasad
రాజేంద్రప్రసాద్ దసరా బుల్లోడు సినిమా టైంలో ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉండేవారట. ఆ విషయం కొంతమంది మిత్రులతో కూర్చున్న సమయంలో అక్కినేని అందరితో చెప్పారట. ఈ విషయం రాజేంద్రప్రసాద్ వరకు వెళ్లిందట. మంచి మిత్రుడు అనుకున్న వ్యక్తి ఇలా చేయడంతో కోపం వచ్చిన రాజేంద్రప్రసాద్ నేరుగా అక్కినేని దగ్గరికి వెళ్లి నిలదీశారట. నా విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ అడిగారట. దీనికి అక్కినేని మౌనంగా ఉండి పోయారట. ఇక అక్కినేని రాజేంద్రప్రసాద్ మధ్య పెద్ద గొడవ జరిగిందట. ఇక పోతే రాజేంద్రప్రసాద్ హీరో జగపతిబాబు కు తండ్రి అవుతాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.