Home » Entertainment » Lavanta Tripsti Dowry To Varun Tej
Entertainment

Varun Tej – Lavanya Tripathi : మెగా ఫ్యామిలీకి లావణ్య ఎంత కట్నం తీసుకొచ్చిందో తెలుసా..?

Authored By
aruna
The Telugu News | Updated on: November 5, 2023 8:47 pm
Advertisement

Varun Tej – Lavanya Tripathi : తాజాగా వరుణ్ లావణ్యలు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇటీవల ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. వరుణ్ పెళ్లికి మెగా ఫ్యామిలీ ఎంతో సందడి చేశారుష అయితే తాజాగా సోషల్ మీడియాలో వరుణ్ లావణ్యల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన వార్తలు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే లావణ్య తల్లిదండ్రులు అల్లుడు వరుణ్ తేజ్ కి కట్న కానుకలు ఎంత ఇచ్చారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆరు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ లావణ్య పేరెంట్స్ దగ్గర ఎలాంటి కట్నం తీసుకోలేదని తెలుస్తుంది. అంతే కాదు పెళ్లి ఖర్చు కూడా అంతా వరుణ్ పెట్టుకున్నాడని సమాచారం. అయితే లావణ్య తల్లిదండ్రులు మాత్రం లావణ్య కి కొంత బంగారం పెట్టి పెళ్లికి పట్టుచీర ఇచ్చారట. అలాగే వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు ధర కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ పెళ్లి కార్డు ఖర్చుతో ఒక మధ్య తరగతి కుటుంబంలో పెళ్లి చేయవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆ పెళ్లి కార్డును ఏకంగా ఆరు లక్షలు పెట్టి డిజైన్ చేపించారని, అందుకే ఒక్క పెళ్లి కార్డుకే దాదాపుగా ఆరు లక్షలు ఖర్చుపెట్టారట. అంతేకాదు లావణ్య తల్లిదండ్రులు బంగారాన్ని ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తుంది. బంగారం విలువ కూడా కోట్ల రూపాయలలో ఉంటుందని తెలుస్తుంది. ఇలా వరుణ్ లావణ్య తల్లిదండ్రుల దగ్గర ఎలాంటి కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నాడు. ఇటలీలో గ్రాండ్గా వివాహం చేసుకున్న ఈ జంట హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ చేసుకోబోతున్నారు మూడు రోజులు ఇటలీలో పెళ్లి సందడి చేసిన మెగా ఫ్యామిలీ హైదరాబాదులో జరగబోతున్న రిసెప్షన్ కి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి