jyothi : కేపీ చౌదరి తో కాల్స్ విషయం లో జ్యోతి ఏం చెప్పిందో వినండి !

Authored By Breaking News | The Telugu News | Published on: June 27, 2023, 12:00 pm

jyothi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి పట్టుబడటంతో అతని కాల్ డేటా పరిశీలించిన పోలీసులు ఇండస్ట్రీలో పలువురు నటీనటులతో సంప్రదింపులు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా కేపీ చౌదరితో నటి జ్యోతి మాట్లాడినట్లు… డ్రగ్స్ కేసులను కూడా సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేపీ చౌదరితో కాల్స్ విషయం పై నటి జ్యోతి ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చారు.

కేపీ చౌదరితో ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్ తో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగానే ఉన్నానని తన ఫోన్ పోలీసులకు ఇవ్వటానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేయడం జరిగింది. డేటా రిట్రివ్ చేసుకున్న తనకు అభ్యంతరం లేదని అన్నారు. తనకు డ్రగ్స్ డీలింగ్ ఉన్నట్లు నిజా నిజాలు తెలియకుండా కేసు విచారణ జరుగుతున్న సమయంలో దుష్ప్రచారం చేయొద్దని నటి జ్యోతి విన్నవించింది. తనకంటూ జీవితం మరియు కుటుంబం ఉంది అనే ఆవేదన వ్యక్తం చేసి నిజా నిజాలు తెలిసేదాక ఫోటోలు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేసింది.

listen to what jyothi said about calls with kp chaudhary

listen to what jyothi said about calls with kp chaudhary

కేపీ చౌదరి డ్రగ్స్ పార్టీలకు తాను ఎప్పుడూ కూడా హాజరు కాలేదని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తానేమి భయపడి దాకోలేదని పేర్కొంది. ఇప్పటివరకు ఎలాంటి డ్రగ్స్ వినియోగించ లేదని స్పష్టం చేసింది. కావలిస్తే నార్కోటెక్ పరీక్షకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp