Mahesh Babu : మహేష్ తండ్రి పాత్రలో ఒకప్పటి కలల రాకుమారుడు.. పెరిగిన అంచనాలు
ప్రధానాంశాలు:
Mahesh Babu : మహేష్ తండ్రి పాత్రలో ఒకప్పటి కలల రాకుమారుడు.. పెరిగిన అంచనాలు
Mahesh Babu : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాఉ. ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.ఈ మూవీ షూటింగ్ సెట్‌లో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఆయన మహేష్ తండ్రి పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu : మహేష్ తండ్రి పాత్రలో ఒకప్పటి కలల రాకుమారుడు.. పెరిగిన అంచనాలు
Mahesh Babu : క్రేజీ న్యూస్..
ఈ రోల్ కోసం ఇప్పటికే నానా పాటేకర్, విక్రమ్ వంటి నటుల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీలక షెడ్యూల్స్ ఒడిశా, హైదరాబాద్‌లో కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూవీ టీం షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది. వెకేషన్ ట్రిప్స్ తర్వాత రాజమౌళి కొత్త షెడ్యూల్ కెన్యాలో షురూ చేశారు. ఇటీవల దీనికి సంబంధించి అనుమతులు రాగా… టీం మొత్తం కెన్యా వెళ్లినట్లు తెలుస్తోంది.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్స్ ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తారని సమాచారం. అక్కడ అటవీ ప్రాంతాలు, ఫేమస్ అంబోసెలి నేషనల్ పార్క్‌లోనూ షూటింగ్ చేయబోతున్నారట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో… ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా మూవీ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. రామాయణంలోని ‘సంజీవని’ మూవీలో సెంటర్ పాయింట్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఓ డిఫరెంట్ లుక్‌లో మహేష్‌ను జక్కన్న చూపించనున్నారట.