బిగ్‌బాస్ సీజన్ 5 14 వారం ముగింపు దశకు వచ్చేసింది. సీజన్ మొదటి నుంచి సిరి- షణ్నుల మధ్య బంధాన్ని బిగ్ బాస్ బాగా హైలైట్ చేస్తూ వచ్చాడు. అసలు వాళ్ళది స్నేహమా.. ప్రేమ బంధమా తెలియక హౌస్ లోని సభ్యులు, బయట వారు జుట్టు పీక్కుంటు న్నారు. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. షో చివరి ఆఖరికి వచ్చిన వీరిద్దరి పెయిర్ మరి ఇరిటేటింగ్ గా తయారవుతుంది. ఇప్పటిదాకా సిరితో అంటి పెట్టుకొని తిరిగిన షన్ను… ఆమెను బ్యాడ్ చేస్తూ ఆమె చేసిన ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఆమెపై పెత్తనం చెలాయిస్తున్నాడు. సిరి ఎప్పుడేం చేయాలో కూడా తానే నిర్ణయిస్తూ ఆమె గేమ్ ను అతనే ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా… ఇన్ని రోజులు సిరిపై విరుచుకుపడ్డ నెటిజన్లు.. ఇప్పుడు షన్నును గట్టిగా వేసుకుంటున్నారు. వీరితో సహా..
మొదటి నుంచి బిగ్ బాస్ పై రివ్యూస్ ఇస్తూ వస్తున్న నటి మాధవి లత ఈ వ్యవహారం పై తనదైన రీతిలో స్పందించారు. వివాదాస్పద విషయాల్లో ఎప్పుడు ముందు ఉండే మాధవి లత తాజాగా బిగ్ బాస్ హౌస్ లోని సిరి, షన్ను ల బంధంపై పడ్డారు. ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీమ్ మీది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎంటా అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేస్తూ… నవ్వ కూడదు.. ఏడ్వ కూడదు.. వంగ కూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. మీ టీమ్ అంతా ఏం చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిపై షన్ను కమాండింగ్ ను తప్పు పడుతూనే సిరిని సైతం ఓ రేంజ్ లో వేసుకుంది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం చూపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. మంచి గేమ్ ను ఇలాంటి వాటితో పాడు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.
అయితే సిరి, షన్ను ల బంధం పై మాధవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మాధవి లత నచ్చావులే – స్నేహితుడా అనే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాధవికి చెప్పుకోవాల్సిన హిట్ కాదు కదా.. సినీ అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. కరోనా సమయం నుంచి ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో ఆక్టివ్ గా మారింది. ఇటీవల భాజపా పార్టీలో చేరిన ఈమె… సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తునే, బిగ్ బాస్ షో పై తనదైన రీతిలో రివ్యూ ఇస్తూ ఉంటుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.