Madhurapudi Gramam Ane Nenu Movie Trailer Release
అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల. శివ కంఠమనేని హీరోగా నటిస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా `మధురపూడి గ్రామం అనే నేను`. కళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి దర్శకత్వం వహించారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించగా మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న `మధుర పూడి గ్రామం అనే నేను` థియేట్రికల్ ట్రైలర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ విడుదల చేశారు. ఈ సందర్భంగా..
Madhurapudi Gramam Ane Nenu Movie Trailer Release
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – “ఈ రోజు `మధురపూడి గ్రామం అనే నేను` థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నా సొంత మనిషి. హైదరాబాద్‌కి, ఇండస్ట్రీకి వచ్చిన క్రొత్తలో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్పట్లో నాకు మోరల్ సపోర్ట్‌గా ఉండేవారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్‌లో ఫస్ట్ కథ ఇచ్చిన శ్రీహరి గారి `భద్రాద్రి` సినిమాకు మల్లి గారే దర్శకులు. అప్పటి నుండి ఇప్పటి దాకా మా రిలేషన్ అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు. `మధుర పూడి గ్రామం అనే నేను` ట్రైలర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్‌గా ఉంటూనే ఎమోషన్స్‌తో నిండి ఉంది. మరో గొప్ప విషయం ఏంటంటే మణిశర్మగారు సంగీతం అందించారు. అలాగే మా అందరికీ గురు సమానులు గౌతమ్ రాజు గారు ఎడిటర్‌గా చేశారు. ట్రైలర్లో హీరో శివ కంఠమనేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఆ క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. అలాగే హీరోయిన్ క్యాథలిన్ గౌడ, మిగతా ఆర్టిస్టులు చక్కగా చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
Madhurapudi Gramam Ane Nenu Movie Trailer Release
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ, భరణి శంకర్, సత్య, నూకరాజు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం: మల్లి,
సారథ్యం: ముప్పా వెంకయ్య చౌదరి,
సమర్పణ: జి రాంబాబు యాదవ్,
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్,
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్: గౌతమ్ రాజు,
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్,
ఫైట్స్: రామకృష్ణ,
స్క్రీన్ ప్లే: నాగకృష్ణ గుండా,
మాటలు: ఉదయ్ కిరణ్,
సహ నిర్మాతలు: కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.