Mahanati Savitri : మహానటి సావిత్రి ‘ ఒంటి మీద ‘ ఇవి ఉండేవా…? ఎవ్వరికీ కల్లో కూడా తెలీని నిజాలు…!!
Mahanati Savitri : సినీ ఇండస్ట్రీలో మర్చిపోలేని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మహానటి సావిత్రి మాత్రమే. ఆమె అందం, నటనకి ఇప్పటికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడేమో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసి గుడ్ బై చెప్పేస్తున్నారు. కొంతమంది ఏమో పెళ్లి చేసుకోకుండా ఉండి సినిమాలు చేస్తున్నారు. అయితే అప్పట్లో అలా ఉండేది కాదు సావిత్రి, అంజలీదేవి, భానుమతి లాంటి స్టార్ హీరోయిన్లు సరైన సమయానికి వివాహం చేసుకున్నారు.
అప్పటి సినీ ఇండస్ట్రీ పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్స్ ని ఆదరించింది. అంజలీదేవి ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత కూడా హీరోయిన్ గా నటించారు. అలాగే భానుమతి కూడా తన కొడుకుని షూటింగ్ కి తీసుకువచ్చి మరి సందడి చేసేవారట. పెళ్లి అయి, పిల్లలు ఉన్న వారు హీరోయిన్లు గానే కొనసాగారు. ఇక సావిత్రి తన వ్యక్తిగత అలవాట్ల కారణంగా లావుగా అయిపోయారు. తన భర్త జెమిని గణేషన్ తో విభేదాలు, వివాదాల కారణంగా ఆమె ఎప్పుడు ఆందోళనగా ఉండేవారు.
Mahanati Savitri real life story
ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సావిత్రి వాటి కారణంగా డ్రగ్స్, మద్యానికి బానిస అయిపోయారు. అయిన షూటింగ్ కి మాత్రం సరైన సమయానికి వచ్చేవారు. కానీ ఆమె లావు అయిపోవడం వలన చాలా వరకు హీరోయిన్ ప్లేస్ నుంచి తొలగించారు. నడుము మడతలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆమెను హీరోయిన్ గా చాలా సినిమాల్లో తొలగించారట. అయినా కానీ సావిత్రి సినిమా పరిశ్రమలు ఎన్నటికీ చెరగని హీరోయిన్గా తన పేరును ముద్రించుకున్నారు.
