Mahesh Babu : ఒక్క పాట పెడితే డ్రాపయిన కలెక్షన్లు వస్తాయా మ మ మహేషా..?

Mahesh Babu : గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్ బస్టర్స్ చూస్తుందీ అంటే అది సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కడే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి మహేశ్ ఖాతాలో మొత్తానికి ఓ ఫ్లాప్ పడిందని ఆడియన్స్ తేల్చేశారు. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది సర్కారు వారి పాట. ఈ మూవీలో మహేశ్ రికవరీ ఏజెంట్ పాత్రలో నటించాడు. తనే లోన్స్ ఇవ్వడం అవి తిరిగి కట్టని వాళ్ళ బెండు తీయడమే పాత్ర స్వభావం. మంచి యూనివర్సల్ పాయింటే. ఈ పాయింట్ విన్న అందరూ ఓ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఊహించుకున్నారు.

తీరా చూస్తే చాలా సాదాసీదా కథా, కథనాలతో వండేశాడు దర్శకుడు పరశురాం. పోకిరి వైబ్స్ అని ఊదరగొట్టారే తప్ప అసలు పూరి మేకింగ్ ఎక్కడ ఇప్పుడు వచ్చిన సర్కారు వారి పాట సినిమా ఎక్కడా..? అనే కామెంట్స్ సినిమా రిలీజయ్యాక వచ్చాయి. ఏవో కొన్ని సీన్స్ తప్ప సినిమాలో అంతగా ఆకట్టుకునే అంశాలేవీ లేకపోవడం సర్కారు వారి పాట సినిమాకు పెద్ద మైనస్. పోకిరి వైబ్స్ అన్నారు. ఆ కథలో మహేశ్ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో, మ్యానరిజం..డైలాగ్స్, ఇలియానా గ్లామర్..తనతో లవ్ ట్రాక్…ప్రకాష్ రాజ్, సత్య ప్రకాష్‌ల స్ట్రాంగ్ రోల్స్, షాయాజీ షిండే, బ్రంహానందం – ఆలిలా కామెడి ట్రాక్ ..ఇలా చెప్పుకుంటే పోతే లెక్కకు మించి చాలా ఉన్నాయి.

Mahesh Babu about Ma Ma Mahesha Song

Mahesh Babu : తీరా చూస్తే భారీగా లాస్ వచ్చిందని టాక్..?

వాటిలో సగం కూడా సర్కారు వారి పాటలో లేవని అందరూ చెప్పుకున్నారు. మెయిన్ విలన్‌గా నటించిన సముద్రఖని పాత్ర కొత్తగా లేకపోవదం సినిమాను గట్టిగా దెబ్బకొట్టింది. మొదటివారం అంతా ఇంతా..మా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ బద్దలు.. అని జనాలను ఊదరగొట్టారు. తీరా చూస్తే భారీగా లాస్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో మురారి బావ అనే పాట ఉండాల్సింది. దాన్ని లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు కలెక్షన్స్ పూర్తిగా డ్రాపయ్యేసరికి మురారి బావ పాట పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహేశ్ సినిమా ఫ్లాప్ అని ఓ పాట యాడ్ చేస్తే కొంతవరకైన రికవరీ అవుతుందని అసలు ఇప్పటివరకూ ఆలోచించలేదు. అలాంటిది ఇప్పుడు సర్కారు వారి పాటకు పాట యాడ్ చేయాలని ఆలోచిస్తుంటే ఒక్క పాట వల్ల డ్రాపయిన కలెక్షన్స్ వస్తాయా మ మ మహేషా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

25 minutes ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

12 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

15 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

19 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

22 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago