Janaki Kalaganaledu 30 May Today Episode : రామా, జానకి పెళ్లి పేరుతో హైదరాబాద్ వెళ్తున్నారన్న నిజం జ్ఞానాంబకు చెప్పిన మల్లిక.. ఇంతలో మరో ట్విస్ట్?

Janaki Kalaganaledu 30 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మే 2022, సోమవారం ఎపిసోడ్ 311 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ బాక్స్ తీసుకొని సునంద.. జ్ఞానాంబకు ఇస్తుంది. తీసుకో అంటుంది. ఆహ్వాన పత్రికను కూడా జ్ఞానాంబ అందజేస్తుంది. మరోవైపు రామచంద్ర.. స్వీట్స్ వ్యాపారంలో నీకు తలపండిపోయింది కాబట్టి అప్పుడప్పుడు నీ సలహాలు తీసుకుంటాను అంటాడు కన్నబాబు. వెళ్లి వస్తాను జ్ఞానాంబ.. స్వీట్ షాపు ఓపెనింగ్ రోజు కలుద్దాం అంటుంది సునంద. కన్నబాబు కూడా రామచంద్రతో వస్తాను.. నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. జ్ఞానం.. కాంట్రాక్ట్ లు, కమిషన్లు అంటూ బాగానే సంపాదించింది కదా. మరి ఈవిడ స్వీట్ కొట్టు పెట్టుకోవడం ఏంటి అంటాడు గోవిందరాజు. దీంతో అదే నాకు అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ.

karthika deepam 30 may 2022 full episode

సర్లేండి.. మనకెందుకు వాళ్ల ఇష్టం అది.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. రామా, జానకి మాత్రం షాక్ లో ఉండటం చూసి మల్లికకు ఏదో అనుమానం వస్తుంది. మనం ఇచ్చిన షాక్ కు రామచంద్ర, జానకికి దిమ్మతిరిగింది అని కన్నబాబు.. సునందతో అంటాడు. ఇంతలో బయటికి వచ్చిన జానకి.. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా. గడువులోపు నీ డబ్బులు నీ మొహాన కొడుతా అని చెప్పా కదా. మరి నోరు మూసుకొని కూర్చోకుండా ఏంటి ఈ ఎక్స్ ట్రాలు అంటుంది. దీంతో ఎక్స్ ట్రాలు కాదు.. నమ్మకం. గడువులోపు మీరు డబ్బులు కట్టరు.. అందుకే ఈ ప్రయత్నాలు అంటాడు కన్నబాబు. కన్నబాబు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకు అంటాడు రామచంద్ర. దీంతో ఏంటి రామా భయపడ్డావా.. మీ అమ్మకు ఎక్కడ చెప్పేస్తానని భయపడ్డావా అని అంటాడు కన్నబాబు.

నీ డబ్బులు నీకు విసిరేస్తాం.. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటుంది జానకి. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు వాళ్లు. మరోవైపు వీళ్లు ఏం మాట్లాడారో విందామని అనుకునే లోపు సునంద వాళ్లు వెళ్లిపోయారని బాధపడుతుంది మల్లిక. ఎండాకాలంలో కూడా గజగజా వణికినట్టు వీళ్లెందుకు అబ్బా.. ఇంత టెన్షన్ పడుతున్నారు అని అనుకుంటుంది మల్లిక.

మరోవైపు ఎలా కన్నబాబు అప్పు తీర్చాలా అని ఆలోచిస్తూ ఉంటారు రామా, జానకి. గడువు తీరేదాకా.. కన్నబాబు అత్తయ్య గారికి ఈ విషయం చెప్పడు అంటుంది జానకి. ఎలాగైనా మనం చెఫ్ పోటీలకు వెళ్తున్నాం కాబట్టి.. డబ్బు సమస్య గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటుంది జానకి.

ఇంతలో గోవిందరాజు అక్కడికి వస్తాడు. ఏంటమ్మా.. ఏదో డబ్బులు అంటున్నారేంటి అంటాడు గోవిందరాజు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాదు రామాకు. డబ్బుల గురించి మీకు టెన్షన్ ఏంటి అని అడుగుతాడు గోవిందరాజు. మరోవైపు నా లక్ష రూపాయలు పోయాయి.. నా పట్టు చీర పోయింది అని బాధపడుతూ ఉంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 30 May Today Episode : రామాకు ఖర్చుల కోసం డబ్బు ఇచ్చిన గోవిందరాజు

ఇంతలో రామా, జానకి, గోవిందరాజు మాట్లాడుకోవడం చూస్తుంది. హైదరాబాద్ లో ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అని అంటాడు రామా. దీంతో రాముడు.. ఇది తీసుకో అని ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు. దీంతో ముందు తీసుకొని చూడు నాన్న అంటాడు.

అందులో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులను చూసి ఇన్ని డబ్బులు ఎందుకు నాన్న అంటాడు రామా. దీంతో అంత దూరం వెళ్తున్నారు కదా.. ఖర్చులకు ఉపయోగపడతాయి ఉంచండి అంటాడు గోవిందరాజు. వామ్మో.. వీళ్లకు ఎంత ప్రేమ అని అనుకుంటుంది మల్లిక.

ఏదో నా సంతోషం కోసం ఇచ్చాను తీసుకోండి అంటాడు గోవిందరాజు. అరేయ్ రాముడు.. నువ్వు చిన్నప్పుడు బడికి వెళ్తుంటే నీ జేబులో ఒక పావలానో అర్థరూపాయో పెట్టి కొనుక్కో అని చెప్పాల్సింది కానీ.. దేవుడు నన్ను మంచంలో పడేసి నాకు ఆ అదృష్టం ఇవ్వలేదురా.

ఇప్పటికి కూడా నువ్వు అలాగే చేస్తున్నావు. కానీ.. నీకోసం ఈ నాన్న ఒక జత బట్టలు కూడా కొని ఇవ్వలేకపోయాడు అని ఏడుస్తాడు గోవిందరాజు. దీంతో నాన్న.. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అంటాడు రామా. ఇవి కూడా నువ్వు నాకు ఇచ్చినవే. నా ఖర్చుల కోసం దాచాను.

ఇన్నాళ్లకు నాకు ఇలా ఇచ్చే అవకాశం దక్కింది. నాకోసం నువ్వు కాదనకుండా తీసుకోవాల్సిందే.. అంతే అంటాడు గోవిందరాజు. ఇదిగో మీరు హైదరాబాద్ వెళ్లడానికి బస్ టికెట్స్ తెచ్చాను అని టికెట్స్ ఇస్తాడు గోవిందరాజు. దీంతో మల్లిక షాక్ అవుతుంది.

రాముడు.. నువ్వు వంటల పోటీల్లో గెలవాలి. నీ పేరు దేశమంతా మారుమోగిపోవాలి. వెళ్లండి.. త్వరగా బ్యాగులు సర్దుకొని రెడీ అవ్వండి అంటాడు గోవిందరాజు. అతడు చెప్పే మాటలన్నీ వింటుంది మల్లిక. అబద్ధం చెప్పి హైదరాబాద్ వంటల పోటీలకు వెళ్తున్నారన్నమాట. ఈ మోసాన్ని వెంటనే పోలేరమ్మ దగ్గర నాగస్వరం ఊదినట్టు ఊదాలి అని అనుకుంటుంది మల్లిక.

మరోవైపు వాళ్ల కోసం పులిహోర తయారు చేస్తుంటుంది జ్ఞానాంబ. పక్కనే చికిత కూడా ఉంటుంది. అక్కడికి వెళ్లిన మల్లిక.. అత్తయ్య గారు.. ఈ పెళ్లి పేరు వెనుక పద్మవ్యూహం అంత వ్యూహం ఉంది. వాళ్లు వెళ్తోంది పెళ్లికి కాదు.. మీకు అలా చెప్పి హైదరాబాద్ వంటల పోటీలకు వెళ్తున్నారు అని అంటుంది మల్లిక.

ఏంటి నువ్వు చెప్పేది అంటుంది జ్ఞానాంబ. అవును అంటుంది మల్లిక. ఈ ప్లాన్ అంతా మామయ్య గోవింద రాజులు గారు నడిపిస్తున్నారు అని అసలు నిజం చెబుతుంది జ్ఞానాంబ. దీంతో ఆయన నామాట దాటి అస్సలు ప్రవర్తించరు. చెప్పిన అబద్ధాలు చాలు కానీ.. ఇక బయలుదేరు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

7 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

8 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

9 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

11 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

12 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

13 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

14 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

15 hours ago