Mahesh Babu : మహేశ్ బాబు ‘అతడు’ సినిమాను రిజక్ట్ చేసిన మరో కుర్ర హీరో ఎవరో తెలుసా..!

Authored By mallesh | The Telugu News | Published on: November 30, 2021, 1:20 pm

Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ ఎంత పెద్ద బ్లాక్ బ్లాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సెషన్. అయితే, ఈ సినిమా స్టోరీని మహేశ్ బాబు కంటే ముందు దర్శకుడు తివిక్రమ్ ఇద్దరు హీరోలకు వినిపించారట.. అందులో ఒక హీరో గురించి మాత్రమే మనకు తెలుసు. ఆయనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా చాలా మంది వీక్షిస్తారు. అంతగా మెప్పిస్తుంది ప్రేక్షకులను..అతడు సినిమా క్రైం అండ్ సస్పెన్స్ నేపథ్యంలో సాగుతుందన్న విషయం తెలిసిందే.

ఇందులోని సైలెంట్ యాక్షన్ అండ్ కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా మహేశ్ బాబు నటన, హీరో త్రిష మధ్య జరిగే సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలని పిస్తాయి. అప్పట్లో మణిశర్మ సంగీతం కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.అతడు మూవీ స్టోరీని త్రివిక్రమ్ మొదట పవన్ కళ్యాణ్‌కు వివరించగా నచ్చలేదని చెప్పారట.. ఆ తర్వాత అప్పుడు కెరీర్ మంచి రైజింగ్‌లో ఉన్న కుర్ర హీరో ఉదయ్ కిరణ్‌కు ఈ కథ చెప్పగా ఓకే అన్నారని తెలిసింది.

mahesh babu athadu movie another hero rejected

mahesh babu athadu movie another hero rejected

Mahesh Babu : పవన్ కాకుండా ఇంకెవరకు రిజెక్ట్ చేశారు

ఈ మూవీ ప్రొడ్యూసర్ మురళీ మోహన్ నటుడు ఉదయ్ కిరణ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఈ సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో అప్పుడు మహేశ్ బాబు వద్దకు ఈ స్టోరీ వెళ్లగా ఆయన ఓకే చేయడం, సినిమా బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఎంతమేర వాస్తవం ఉన్నదన్న విషయంపై దర్శకనిర్మాతలు ఇంతవరకూ స్పందించలేదు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp