Mahesh Babu :స్టేజ్‌పై తొలిసారి డ్యాన్స్ చేసిన మ‌హేష్ బాబు.. పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu :స్టేజ్‌పై తొలిసారి డ్యాన్స్ చేసిన మ‌హేష్ బాబు.. పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :17 May 2022,6:30 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సింప్లిసిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. ఇటీవల కాలంలో కనీసం మాట్లాడుతున్నారు కానీ, గతంలో ఆయన మాట్లాడిందే తక్కువ. అయితే డ్యాన్స్ లు, స్టేజ్ పై మూమెంట్స్ అస్సలు ఆయన నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం. అలాంటి మహేష్ బాబు.. మ.. మ.. మహేషా పాటకోసం స్టేజ్ ఎక్కారు. అదిరిపోయే స్టెప్పు వేశారు. స్టేజ్ పై కనిపించింది కాసేపే అయినా మహేష్ బాబు మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. ‘సర్కారు వారి పాట’ ఇచ్చిన సక్సెస్ జోష్ ఏమో తెలియదు కానీ.. మొదటిసారి వేదికపై డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.మే 12న విడుదలైన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఎస్‌వీపీ చిత్రంకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మహేశ్ స్వాగ్‌ను అభిమానులు వెండితెరపై ఆస్వాదిస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా భారీ హిట్ కొట్టడంతో సోమవారం (మే 16) రాత్రి ‘మమ మాస్‌ సెలబ్రేషన్స్‌’ పేరుతో కర్నూలులో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ వేదికపైకి వెళ్లి ‘మమ మహేశా’ పాటకి డ్యాన్సర్లతో స్టెప్పులు వేశాడు.

mahesh babu dance on the stage

mahesh babu dance on the stage

Mahesh Babu : అద‌ర‌గొట్టేశాడుగా..!

ఆ తర్వాత మహేశ్ బభౌ స్టేజ్‌పైకి వెళ్లి స్టెప్పులు వేశారు. సినిమాలో ‘మమ మహేశా’ ఉన్న స్పెప్స్ సూపర్ స్టార్ వేశారు. దీంతో అక్కడ ఉన్న మహేష్ అభిమానులు అరుపులతో ఊగిపోయారు. దాంతో అక్కడి సభ మొత్తం దద్దరిల్లిపోయింది. తమ అభిమాన హీరో లైవ్‌లో స్టెప్పులేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆనందపడ్డారు.ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా సినిమా నిలకడగా ఆడుతోంది. గతంలో ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్లే కానీ, ఇలా సక్సెస్ మీట్లకు మహేష్ కాస్త దూరంగానే ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం కాస్త సీరియస్ గా ప్రమోషన్ పై దృష్టిపెట్టారు.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది