Mahesh Babu : నాకు అన్నీ నువ్వే… వ‌చ్చే జ‌న్మ‌లోను నువ్వే నాకు అన్న‌య్య అంటూ మహేష్ ఎమోష‌న‌ల్

Authored By Sam C | The Telugu News | Updated on : 9 January 2022, 5:30 pm

Mahesh Babu : ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుడు, మహేష్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు గత రాత్రి (జనవరి 8) కన్నుమూసిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు మరణ వార్త తెలిసి యావత్ టాలీవుడ్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. కొద్ది సేప‌టి క్రితం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్‌కు తరలించగా పలువురు ప్రముఖులు రమేష్ బాబును కడసారి చూసి నివాళులర్పించారు.

జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి చేశారు. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తండ్రి చితికి నిప్పంటించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. క‌రోనా వ‌ల‌న మ‌హేష్ బాబు త‌న అన్న‌య్య చివ‌రి చూపుకు నోచుకోలేదు. కాని ఆయ‌న త‌న బాధ‌ను సోష‌ల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియ‌జేశారు.

mahesh babu emotional post is viral

mahesh babu emotional post is viral

Mahesh Babu : చివ‌రి చూపుకు నోచుకోలేక‌పోయిన మ‌హేష్ బాబు

‘మీరే నాకు ఆదర్శం. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుండా ఉంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మహేశ్‌. టాలీవుడ్ స్టార్ హీరోగా మ‌హేష్ ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కార‌ణం కూడా ర‌మేష్ అని కొంద‌రు సినీ ప్ర‌ముఖులు చెబుతుంటారు.

Sam C

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp