Home » Entertainment » Mahesh Babu Fans Fires On Director Trivikram Srinivas
Entertainment

Mahesh Babu : త్రివిక్రమ్ పేరు చెప్తే మహేష్ బాబు ఫ్యాన్స్ రక్తం మరిగిపోతోంది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 25, 2023 10:44 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ సర్కారు వారి పాట ‘ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ssmb28 సినిమా చేస్తున్నాడు. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ సినిమాకి రచయితగా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో తమిళంలో విడుదలైన వినోదయ సీతం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రీమేక్ గా తెలుగులో తీస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఒక యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

Mahesh Babu Fans Fires On Director Trivikram Srinivas

పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.గతంలో పవన్ కళ్యాణ్ ‘ గోపాల గోపాల ‘ సినిమాలో దేవుడి పాత్రలో కనిపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో దేవుడు పాత్రలో కనిపించడున్నాడు. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అయితే ఈ మధ్యనే మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను జూలై 28వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఆ తర్వాత నెలలో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ssmb28 ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉంది.

Advertisement

అయితే ఇప్పుడు ఈ సినిమాకు రచయితగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాని ఆగస్టున విడుదల చేయడం లేదని తెలుస్తుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమాకి డైరెక్టర్ సముద్రఖని. ఆయనకు తెలుగు మీద అంత పట్టు లేకపోవడంతో త్రివిక్రమ్ ఈ సినిమా బాధ్యతలు అన్ని చూస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలను వెంటవెంటనే రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి మహేష్ బాబు సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. ఆగస్టు 11న మహేష్ బాబు సినిమా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి