Mahesh Babu : రాజమౌళి సినిమాపై కీలక అప్ డేట్ ఇచ్చిన మహేష్ బాబు.. వీడియో

Authored By Breaking News | The Telugu News | Published on: August 21, 2023, 8:00 pm

Mahesh Babu : ఇటీవల బిగ్ సి స్టార్ట్ అయ్యే 20 సంవత్సరాలు కావచ్చిన క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాజమౌళి ప్రాజెక్టు గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. మీరు ఇటీవల ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ప్రాజెక్టు కోసమేనా మీరు వర్కౌట్ స్టార్ట్ చేసింది అని అడిగారు.

ఈ ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ తాను.. ఎప్పటినుండో వర్కౌట్స్ చేస్తూ ఉన్నా. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. రాజమౌళి ప్రాజెక్టు ఇంకా అప్పుడే స్టార్ట్ కాలేదు. ఒకవేళ దానికోసమే అయితే ముందుగానే అందరికీ తెలియజేస్తా.. రెగ్యులర్ ఫిట్నెస్ కోసం తాను ఎక్సర్సైజ్ లు చేస్తున్నట్లు మహేష్ స్పష్టత ఇచ్చారు. “RRR” తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి.

Mahesh Babu Gives Clarity About His Movie With SS Rajamouli

Mahesh Babu Gives Clarity About His Movie With SS Rajamouli

దాదాపు ₹1000 కోట్లు బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. “RRR” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన రాజమౌళి… మహేష్ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నాలజీని జక్కన్న వాడబోతున్నట్లు టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్న మహేష్.. ఇది కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా చేయనున్నట్లు సమాచారం.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp