
mahesh babu thinking about goutham
Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా అంతే యాక్టివ్‌గా ఉంటున్నారు. సితార రచ్చ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మహేష్ తనయుడు గౌతమ్ వెండితెరపై సందడి చేయగా, ఇప్పుడు తన తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు. హైస్కూల్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఓ ఫోటోను పంచుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమ్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మహేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన కొడుకు పై ప్రశంసలు కురిపించారు.
నమ్రత కూడా తన కొడుకుని చూసి తెగ మురిసిపోతుంది. కొడుకు సాధించిన ఘనత పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్లడం మహేష్ కు అలవాటు. సరదాగా ఓ 10 రోజులు అలా ట్రిప్ కు వెళ్లొస్తుంటారు. అలా ఎన్నో దేశాలు చుట్టేశారు. ఇప్పుడు కూడా మహేష్ అండ్ ఫ్యామిలీ విహార యాత్రలోనే ఉంది. అయితే ఈసారి వాళ్ల విహారం-ఆనందం రెట్టింపు అయింది. యూరోప్ పర్యటనలో ఉంటుండగానే మహేష్ కొడుకు గౌతమ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి.అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాడు. దీంతో కొడుకు సాధించిన ఘనతను మహేష్ కుటుంబం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. జర్మనీలోని ఓ పెద్ద హోటల్ లో పార్టీ చేసుకుంది.
mahesh babu happy about his son
వన్-నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు గౌతమ్. తండ్రి మహేష్ బాబు టైపులోనే బాలనటుడిగా కెరీర్ కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. కానీ గౌతమ్ కు ఆ అవకాశం ఇవ్వలేదు మహేష్. అతడ్ని పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టేలా చేశాడు. అలా ప్రస్తుతం చదువుపైన దృష్టిపెట్టిన గౌతమ్, ఓ మంచి రోజు చూసి మరోసారి తెరపైకొస్తాడు.ఇక మహేష్ సర్కారు వారి పాట విషయానికి వస్తే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.