
mahesh babu intersting comments on jr ntr
Mahesh Babu : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై సినిమాలు చేస్తూనే టెలివిజన్ ప్రోగ్రాం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హోస్ట్‌గా ఉన్నారు. ఈ రియాలిటీ షో కు సాధారాణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. ఇక ఈ షో స్టార్టింగ్ డేకు జూనియర్ ఎన్టీఆర్ అన్న ‘ఆర్ఆర్ఆర్’ అల్లూరి సీతారామరాజు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. ఇక ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు సమంత, కొరటాల శివ, సమంత, ఎస్.ఎస్.థమన్, దేవిశ్రీప్రసాద్ హాజరయ్యారు. తాజాగా మహేశ్ బాబు హాజరు కాగా, ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో నెట్టింట తెగ వైరలవుతోంది.
mahesh babu intersting comments on jr ntr
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంకు గెస్ట్‌గా హాజరవుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు.. ‘వెల్ కమ్ మహేశ్ అన్న’ అంటూ తారక్ ఆహ్వానించారు. ఆ తర్వాత హాట్ సీట్‌లో మహేశ్, హోస్ట్ సీట్‌లో తారక్ కూర్చొని అలా సరదాగా ముచ్చట పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తారక్ క్వశ్చన్స్‌ను ట్విస్ట్ చేసే అడుగుతుండగా.. మహేశ్ అలా అడగడమెందుకని అంటాడు. అందుకు తారక్ ‘సరదాగా..’ అని బదులివ్వగా.. నీ కంటే గురువుగారే నయం అని అన్నారు.
తారక్, మహేశ్ బాబును ఒకే ఫ్రేంలో చూసి నందమూరి, కృష్ణ-మహేశ్, సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే ఫ్రేంలో చూడటం ఆనందంగా ఉందని నెటిజన్లు ప్రోమోను చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తారక్-మహేశ్ ‘భరత్ అనే నేను’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వీరి సినిమాల విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్-చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతుండగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.