Mahesh Babu : ఒకే ఫ్రేంలో ఇద్దరు స్టార్స్.. జూనియర్ ఎన్టీఆర్‌ కంటే ఆయనే నయమన్న మహేశ్ బాబు..

0
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై సినిమాలు చేస్తూనే టెలివిజన్ ప్రోగ్రాం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హోస్ట్‌గా ఉన్నారు. ఈ రియాలిటీ షో కు సాధారాణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. ఇక ఈ షో స్టార్టింగ్ డేకు జూనియర్ ఎన్టీఆర్ అన్న ‘ఆర్ఆర్ఆర్’ అల్లూరి సీతారామరాజు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. ఇక ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు సమంత, కొరటాల శివ, సమంత, ఎస్.ఎస్.థమన్, దేవిశ్రీప్రసాద్ హాజరయ్యారు. తాజాగా మహేశ్ బాబు హాజరు కాగా, ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో నెట్టింట తెగ వైరలవుతోంది.

Mahesh Babu : ఒకే వేదికపై ఉండి నవ్వులు పూయించిన తారక్, మహేశ్..

mahesh babu intersting comments on jr ntr
mahesh babu intersting comments on jr ntr

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంకు గెస్ట్‌గా హాజరవుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు.. ‘వెల్ కమ్ మహేశ్ అన్న’ అంటూ తారక్ ఆహ్వానించారు. ఆ తర్వాత హాట్ సీట్‌లో మహేశ్, హోస్ట్ సీట్‌లో తారక్ కూర్చొని అలా సరదాగా ముచ్చట పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తారక్ క్వశ్చన్స్‌ను ట్విస్ట్ చేసే అడుగుతుండగా.. మహేశ్ అలా అడగడమెందుకని అంటాడు. అందుకు తారక్ ‘సరదాగా..’ అని బదులివ్వగా.. నీ కంటే గురువుగారే నయం అని అన్నారు.

తారక్, మహేశ్ బాబును ఒకే ఫ్రేంలో చూసి నందమూరి, కృష్ణ-మహేశ్, సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే ఫ్రేంలో చూడటం ఆనందంగా ఉందని నెటిజన్లు ప్రోమోను చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తారక్-మహేశ్ ‘భరత్ అనే నేను’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వీరి సినిమాల విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్-చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతుండగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది.

Advertisement