Home » Entertainment » Mahesh Babu Movie Heroine Fix
Entertainment

Mahesh Babu : సూపర్‌ స్టార్ మహేష్ బాబు మరదలిగా కుర్ర హీరోయిన్ ఫిక్స్..?

Authored By
mallesh
The Telugu News | Published on: October 6, 2022, 6:00 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త సినిమా చేస్తున్నట్టు అందరికీ తెలిసిందే. దీనికి ఎస్‌ఎస్‌ఎంబీ-28 అనే పేరును ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ ఎప్పుడైనా సక్సెస్ ఫుల్ ఫార్ములా అనుసరిస్తాడు. తనకు హిట్ కాంబినేషన్ అనుకున్నవారితో తన సినిమాలు మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. త్రివిక్రమ్ లిస్టులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో కథకు చాలా ప్రయారిటీ ఇస్తుంటాడు. స్టోరీ చాలా సింపుల్ గా ఉన్నా తన మేకింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు.

Advertisement

స్క్రీన్ ప్లేకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాడు. అందువల్లే మాటల మాంత్రికుడి సినిమాలు హిట్ అవుతుంటాయి. ఈయన తీసిన సినిమాల్లో ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ వాటికి కూడా టీవీలో ప్రసారమైనప్పుడు రేటింగ్స్ చాలా బాగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా తీసిన నటీనటులతోనే సినిమాలు చేస్తుంటారు. అప్పట్లో మహేశ్‌తో వరుసగా సినిమాలు చేసిన ఈ స్టార్ దర్శకుడు ఆ తర్వాత అల్లు అర్జున్ తో తెరకెక్కించారు. భవిషత్య్‌లో ఎన్టీఆర్‌తో వరుసగా సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu Movie heroine fix

Advertisement

Mahesh Babu : మహేశ్ మరదలిగా హాట్ భామ..

ఇక హీరోయిన్ల విషయంలో కూడా ఈ దర్శకుడు సేమ్ ఫార్ములాను రిపీట్ చేస్తున్నాడు. మొన్నటివరకు పూజాహెగ్డెను వరుసగా సినిమాల్లో తీసుకున్న త్రివిక్రమ్.. తాజాగా మహేశ్ బాబుతో సినిమాకు కూడా ఈమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో అలవైకుంఠపురములో, అరవిందసమేత వీరరాఘవ సినిమాలో కూడా పూజానే తీసుకున్న త్రివిక్రమ్.. మహేశ్ బాబు సరసన కూడా ఆమెను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక పూజా చెల్లెలి రోల్ కోసం కుర్రహీరోయిన్ శ్రీలీలను తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదట కృతిశెట్టిని, శ్రీలీల తీసుకుందామని అనుకున్నా.. చివరకు శ్రీలీల అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడని తెలిసింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి