Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు మహేశ్ బాబును చాలా ఇష్టపడుతుంటారు. అంత అందగాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు. ఇకపోతే మహేశ్ బాబు ఎవరూ ఊహించని విధంగా ఒకప్పటి మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందిరికీ విదితమే. మ్యారేజ్‌కు ముందర నమ్రత కోసం చాలా పనులు చేశాడు. అవేంటో తెలుసుకుందాం.యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్షన్‌లో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఫిల్మ్ ‘వంశీ’. ఈ చిత్రంలో మహేశ్ బాబు, నమ్రత హీరో హీరోయిన్స్‌గా నటించారు.
2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాగా, ఈ సినిమా వల్ల మహేశ్ బాబు తన జీవిత భాగస్వామిని అయితే కనుగొన్నాడని చెప్పొచ్చు. ఈ మూవీ షూటింగ్ టైంలో వీరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియాలో జరిగిన 40 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో వీరి మధ్య లవ్ స్టార్ట్ అయి, అది కాస్తా మ్యారేజ్ వరకు వచ్చింది.2000 నుంచి 2005 వరకు ఐదేళ్ల పాటు మహేశ్ బాబు, నమ్రతల మధ్య లవ్ స్టోరి కొనసాగింది. ఈ ఐదేళ్ల పాటు వీరిరువురు తమ లవ్ స్టోరిని సీక్రెట్‌గా మెయింటేన్ చేశారు. ఇకపోతే అన్ని రోజుల పాటు మహేశ్ నమ్రతను చూసేందుకుగాను ఎవరికీ తెలియకుండా ముంబై వెళ్లి వచ్చేవాడు.
అయితే, అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు. అలా సెలబ్రిటీల విషయాలు అంతగా బయటకు వచ్చేవి కావు. కానీ, సినీ మ్యాగజైన్లలో మాత్రం ఇటువంటి విషయాలపైన రాసేవారు. మొత్తంగి సినిమాల షూటింగ్ గ్యాప్స్, వీకెండ్స్‌లో మహేశ్ నమ్రత కోసం ముంబై వెళ్లేవాడు. వీరి ప్రేమ పెళ్లికి ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను ఒప్పించాడు. అలా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిరువురు వివాహం చేసుకున్నారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.