KCR : తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చకచకా చోటు చేసుుకంటున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుండటం గమనార్హం. సీఎం కేసీఆర్ సతీమణి శోభ అనారోగ్యం దృష్ట్యా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు..అక్కడే రాజకీయాలపై పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే కేంద్ర బిందువు అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన తనయ కవితను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ మేరకు టీఆర్ఎస్ వర్గాలు కూడా చర్చించుకున్నాయి. కానీ, నిర్ణయాలు ప్రస్తుతం అనూహ్యంగా మారిపోయాయి. రాజ్యసభకు వెళ్తారని భావించిన కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. నిజానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకుల లలిత పోటీ చేయబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా పేర్కొన్నాయి. కానీ, అనూహ్యంగా సీఎం కేసీఆర్ తనయ కవిత పేరు తెర మీదకు వచ్చింది. ఇందూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి కవితి మండలి మెట్లెక్కబోయే చాన్సెస్ మెండుగా ఉన్నాయి.
కవితను ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది కేటీఆరేనని వార్తలు వస్తున్నాయి. అయితే, చెల్లెలు రాష్ట్రరాజకీయాల్లో ఉండటం వల్ల పార్టీకి బలం చేకూరుతుందని కేటీఆర్ భావించినట్లు తెలుస్తోంది. కొద్ది కాలం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అంతగా కీలక పాత్ర పోషించిన కవిత.. త్వరలో కేబినెట్‌లోకి మంత్రిగా వెళ్లి పార్టీని బలోపేతం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇకపోతే నిజామాబాద్ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలాన్ని బట్టి కవిత ఏకగ్రీవమవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కేటీఆర్, కవితల స్థానం ఏంటి.. వారు రాజకీయంగా పోషించాల్సిన పాత్రపైన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందట. ఈ క్రమంలోనే వారి అవసరాలను బట్టి వారికి తగు అవకాశాలు ఇస్తున్నారనే చర్చ కూడా సాగుతున్నది.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.