mahesh Babu photoshoot with wife namrata
Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ క్యూట్ కపుల్‌గా సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రత జోడీ ఉంది. వీరు ఇరువురు ఒకరికి మరొకరు ప్రతీ విషయంలో సపోర్ట్ చేసుకుంటారు. ఇకపోతే సాయి సూర్య డెవలపర్స్ కోసం గతంలో ఫ్యామిలీతో ఓ యాడ్ చేసిన మహేశ్ బాబు తాజాగా వైఫ్ నమ్రతతో కలిసి ఫొటోషూట్ చేశాడు. ఏళ్ల తర్వాత నమ్రతతో మహేశ్ ఫొటోషూట్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘హలో’ అనే మ్యాగజైన్ కోసం మహేశ్, నమ్రత జంట తాజాగా ఫొటోషూట్ చేశారు. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వీరిరువురు ఇచ్చిన ఫొటో స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
mahesh Babu photoshoot with wife namrata
ఒకే ఫొటో ఫ్రేమ్‌లో మహేశ్‌బాబు, నమ్రతను చూసి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోల్లో బ్లాక్ కలర్ సూట్‌లో మహేశ్ బాబు హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా, మహేశ్ వైఫ్ నమ్రత వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్ ధరించి టామ్ బోయ్‌లా కనిపిస్తోంది. ఇక మహేశ్ బాబు నమ్రతను లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వంశీ’ చిత్రంలో జంటగగా నటించారు మహేశ్, నమ్రత. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించడం విశేషం. ఆ చిత్రంలో అప్పటికి కాబోయే భర్త, మామతో కలిసి నటించింది నమ్రత.
mahesh Babu photoshoot with wife namrata
ఇకపోతే మహేశ్ బాబు పబ్లిసిటీకి సంబంధించిన వర్క్, ట్యాక్స్, ఇతర ప్రొడక్షన్ హౌజ్ వర్క్ మొత్తం నమ్రతనే డీల్ చేస్తుందట. అయితే, మహేశ్ మాత్రం తను నటించే సినిమాల గురించి ఎవరితోనూ డిస్కస్ చేయబోరట. తన డెసిషనే ఫైనల్ అని, అలానే సినిమాలు చేస్తానని మహేశ్ చాలా సార్లు ప్రకటించారు. సూపర్ స్టార్ మహేశ్ ప్రేక్షకులకు చివరగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ప్రజెంట్ మహేశ్ ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
mahesh Babu photoshoot with wife namrata
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.