Mahesh Babu: చాలాకాలం తర్వాత వైఫ్ నమ్రతతో మహేశ్ ఫొటోషూట్.. పిక్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu: చాలాకాలం తర్వాత వైఫ్ నమ్రతతో మహేశ్ ఫొటోషూట్.. పిక్స్ వైరల్

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ క్యూట్ కపుల్‌గా సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రత జోడీ ఉంది. వీరు ఇరువురు ఒకరికి మరొకరు ప్రతీ విషయంలో సపోర్ట్ చేసుకుంటారు. ఇకపోతే సాయి సూర్య డెవలపర్స్ కోసం గతంలో ఫ్యామిలీతో ఓ యాడ్ చేసిన మహేశ్ బాబు తాజాగా వైఫ్ నమ్రతతో కలిసి ఫొటోషూట్ చేశాడు. ఏళ్ల తర్వాత నమ్రతతో మహేశ్ ఫొటోషూట్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘హలో’ అనే మ్యాగజైన్ కోసం మహేశ్, నమ్రత […]

 Authored By mallesh | The Telugu News | Updated on :6 October 2021,8:20 am

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ క్యూట్ కపుల్‌గా సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రత జోడీ ఉంది. వీరు ఇరువురు ఒకరికి మరొకరు ప్రతీ విషయంలో సపోర్ట్ చేసుకుంటారు. ఇకపోతే సాయి సూర్య డెవలపర్స్ కోసం గతంలో ఫ్యామిలీతో ఓ యాడ్ చేసిన మహేశ్ బాబు తాజాగా వైఫ్ నమ్రతతో కలిసి ఫొటోషూట్ చేశాడు. ఏళ్ల తర్వాత నమ్రతతో మహేశ్ ఫొటోషూట్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘హలో’ అనే మ్యాగజైన్ కోసం మహేశ్, నమ్రత జంట తాజాగా ఫొటోషూట్ చేశారు. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వీరిరువురు ఇచ్చిన ఫొటో స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

mahesh Babu photoshoot with wife namrata

mahesh Babu photoshoot with wife namrata

Mahesh Babu: టామ్ బోయ్‌లా కనిపిస్తున్న సూపర్ స్టార్ వైఫ్ నమ్రత..

ఒకే ఫొటో ఫ్రేమ్‌లో మహేశ్‌బాబు, నమ్రతను చూసి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోల్లో బ్లాక్ కలర్ సూట్‌లో మహేశ్ బాబు హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా, మహేశ్ వైఫ్ నమ్రత వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్ ధరించి టామ్ బోయ్‌లా కనిపిస్తోంది. ఇక మహేశ్ బాబు నమ్రతను లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వంశీ’ చిత్రంలో జంటగగా నటించారు మహేశ్, నమ్రత. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించడం విశేషం. ఆ చిత్రంలో అప్పటికి కాబోయే భర్త, మామతో కలిసి నటించింది నమ్రత.

mahesh Babu photoshoot with wife namrata

mahesh Babu photoshoot with wife namrata

ఇకపోతే మహేశ్ బాబు పబ్లిసిటీకి సంబంధించిన వర్క్, ట్యాక్స్, ఇతర ప్రొడక్షన్ హౌజ్ వర్క్ మొత్తం నమ్రతనే డీల్ చేస్తుందట. అయితే, మహేశ్ మాత్రం తను నటించే సినిమాల గురించి ఎవరితోనూ డిస్కస్ చేయబోరట. తన డెసిషనే ఫైనల్‌ అని, అలానే సినిమాలు చేస్తానని మహేశ్ చాలా సార్లు ప్రకటించారు. సూపర్ స్టార్ మహేశ్ ప్రేక్షకులకు చివరగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ప్రజెంట్ మహేశ్ ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

mahesh Babu photoshoot with wife namrata

mahesh Babu photoshoot with wife namrata

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది