
Guntur Kaaram : గుంటూరు కారం బీడీ సీక్రెట్ చెప్పిన మహేష్ బాబు.. దేనితో తయారు చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘ గుంటూరు కారం ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మూడు రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దుమ్మురేపుతుంది. అయితే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్ చేశారు. కొన్ని సీన్లలో బీడీ తాగుతూనే కనిపించారు. దీంతో మహేష్ అన్ని బీడీలు ఎలా తాగారో అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే ఈ బీడీ సీక్రెట్ ను మహేష్ బాబు తాజాగా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రముఖ యాంకర్ సుమ మహేష్ బాబు, శ్రీలీలను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమాలో బీడీ గురించి సుమ అడిగారు. దీంతో మహేష్ సమాధానం చెప్పారు. గుంటూరు కారం సినిమా కోసం తాను తాగిన బీడీలు పొగాకుతో చేసినవి కాదని మహేష్ తెలిపారు. అవి ఆయుర్వేదిక్ బీడీలు అని చెప్పారు. వాటిని వేటితో తయారు చేశారో కూడా వెల్లడించారు.
నేను పొగ తాగను. నేను స్మోకింగ్ ని ప్రోత్సహించను కూడా. అదొక ఆయుర్వేదిక్ బీడీ. అవి లవంగాల ఆకులతో తయారు అయ్యాయి. ముందుగా నాకు రియల్ బీడీ ఇచ్చారు. అది తాగాక నాకు చాలా తలనొప్పి వచ్చింది. నా వల్ల కావడం లేదు ఏం చేద్దామని త్రివిక్రమ్ కు చెప్పా.. ఆ తర్వాత ఆలోచించి ఆయుర్వేదిక్ బీడీ అని సెట్ వాళ్లు ఏదో పట్టుకొచ్చారు. అది చాలా బాగుందని చెప్పి వాడాను. ఆ బీడీలను లవంగం ఆకులతో చేశారు. అలాగే పుదీనా ఫ్లేవర్ తో ఉంటుంది. దాంట్లో పొగాకు అసలు లేదు అది ఆయుర్వేదిక్ అని మహేష్ బాబు తెలిపారు. దీంతో సుమ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇంటర్వ్యూలో ఇదే హైలైట్ అని అన్నారు. ఆయుర్వేదిక్ అయినందుకు బీడీలు మిగిలిపోతే మళ్ళీ జాగ్రత్తగా ప్యాకెట్ లో చుట్టి పెట్టే వారిని తెలిపారు. దీంతో గుంటూరు కారంలో వాడిన బీడీల సీక్రెట్ రివీల్ అయింది.
గుంటూరు కారం సినిమాలో చిరంజీవి స్వయంకృషి సినిమా డైలాగులు వాడటంపై కూడా మహేష్ బాబు స్పందించారు. తనకు చిరంజీవి అంటే చాలా గౌరవం అని, అందుకే సినిమాలో స్వయంకృషిలో డైలాగ్ చెప్పానని అన్నారు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు సుదర్శన్ థియేటర్లో అభిమానుల స్పందన అద్భుతంగా ఉందని అన్నారు. సినిమాలో ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశారు. మహేష్ మాస్, డైలాగ్స్, యాక్షన్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేసారు. ఈ సినిమాలో మహేష్ బాబును చూసి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో మరో ప్రధాన అంశంగా నిలిచింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.