Mahesh Babu : ఎన్టీఆర్ ట్రైనర్‌ని అద్దెకు తీసుకున్న మ‌హేష్ బాబు.. ఇక సిక్స్ ప్యాక్‌తో ర‌చ్చ చేస్తాడా?

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 9:20 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అప‌జ‌యం అనేది లేకుండా దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం స‌ర్కారు వారి పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మ‌రో సినిమాకి సిద్ధ‌మ‌య్యాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ క్లాస్ మూవీ చేయ‌బోతున్నాడు. .అతడు, ఖలేజా లాంటి సినిమాలతో మహేష్ లోని మరో యాంగిల్ చూపించిన త్రివిక్రమ్.ఇప్పుడు మరోసారి మహేష్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించనున్నారన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మొన్నామధ్య మహర్షి సినిమాలో గడ్డంతో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చారు. తాజాగా త్రివిక్రమ్ సినిమాలోనూ మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

Mahesh Babu : అద‌రగొట్టేయ‌డం ఖాయం..

మహేశ్ బాబు తాజాగా తన బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ కోసం జిమ్ వర్క్ అవుట్స్ ను ప్రారంభించారు. ప్రముఖ సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ గైడ్ లైన్స్ లో శిక్షణ మొదలెట్టారు. ఈయన హీరోల బాడీలను పాత్రలకు, షూటింగ్ కు అనుకూలంగా ట్రైన్ చేస్తారు. కఠినమైన శిక్షణతో అట్రాక్టివ్ ఫిట్ నెస్ ను తెప్పిస్తారు. సిక్స్ ప్యాక్ కోసం ఈయ‌న‌ని ప‌లువురు హీరోలు అప్రోచ్ అవుతుంటారు. మ‌హేష్ కూడా సిక్స్ ప్యాక్ కోసం ఇత‌డిని అప్రోచ్ అయ్యాడా అనే టాక్ వినిపిస్తుంది.

Mahesh Babu six pack with trainer

Mahesh Babu six pack with trainer

ఇత‌ను గ‌తంలో ఎన్టీఆర్‌తో క‌లిసి అర‌వింద స‌మేత‌, ఆర్ఆర్ఆర్ సినిమాకి పని చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 31 వ సినిమాకి కూడా ప‌ని చేయ‌బోతున్నాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే త్రివిక్రమ్ – మహేశ్ బాబు చిత్రం ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే మహేశ్ అదిరిపోయే లుక్ కూడా ఫైనల్ అయ్యింది. ఇటీవల ఆ పిక్ ను పంచుకోగా.. తాజాగా లాయిడ్ తో కలిసి మరో స్టైలిష్ పిక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp