Mahesh Babu : కొడుకు కోసం మ‌హేష్ బాబు అంత త‌పన ప‌డుతున్నాడా.. మ‌ళ్లీ విదేశాల‌కు ఎందుకు?

Authored By Sam C | The Telugu News | Published on: July 11, 2022, 9:30 pm

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తుంటాడు. భార్య‌, పిల్ల‌ల వ్య‌వ‌హారాల‌కి సంబంధించి అప్ర‌మ‌త్తంగా ఉంటాడు. ఈ మధ్యనే మ‌హేష్ త‌న ఫ్యామిలీతో రెండు మూడు దేశాల్లో హాలీడేస్ గడిపి వచ్చారు. సర్కారు వారి పాట తరువాత విదేశాలకు వెళ్లారు. త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక హాసిని నిర్మించే సినిమాను స్టార్ట్ చేయాల్సి వుంది. అయితే మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు.అయితే ఈసారి విదేశాలకు వెళ్లేది వెకేషన్ కు కాదు. కొడుకు గౌతమ్ ను విదేశాల్లోని కాలేజీల్లో చేర్పించడానికి అని వినిపిస్తోంది.

ఏ కాలేజీ, ఏ కోర్సు, ఏ దేశం అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలో తెలుస్తాయి. కానీ ప్రస్తుతం గౌతమ్ ఇంటర్ ఇక్కడే జాయిన్ అయ్యాడు. అందువల్ల మళ్లీ మార్చి విదేశాల్లో వేస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు. గౌత‌మ్ 2006 ఆగస్టులో హైదరాబాద్ లోనే జన్మించాడు. స్టార్ కిడ్ గా గౌతమ్ అందరికీ తెలుసు. గౌతమ్ ఇటీవ‌ల‌ తన స్కూల్ ఎడ్యుకేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల పది ఫలితాలు కూడా వెలువడ్డాయి. గౌతమ్ టెన్త్ రిజల్ట్స్ లో ప్రథమ గ్రేడ్ ను సాధించాడు.

mahesh babu thinking about goutham

mahesh babu thinking about goutham

Mahesh Babu : గౌత‌మ్ కోసం..

దీంతో కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు. గౌతమ్ టెన్త్ ఫలితాలపై తల్లిదండ్రులు మహేష్ బాబు, నమ్రత గౌతమ్ ను అభినందిస్తూ తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు కూడా పెట్టారు. గౌతమ్ చదువుతో పాటు ఇతర యాక్టివిటీల్లోనూ చురుకుగానే ఉంటున్నారు. ఇప్పటికే తన తండ్రి మహేశ్ బాబు తో కలిసి చైల్డ్ ఆర్టిస్గ్ గా ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు. బిగ్ స్క్రీన్ పై కనిపించి తెలుగు ఆడియెన్స్ ను పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా 2018లోనే గౌతమ్ తన ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌ పోటీల్లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp